పెళ్లి రోజు శుభాకాంక్షలు బాస్‌!

Wednesday, April 2, 2025

మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ వివాహం జరిగి నేటికి(ఫిబ్రవరి 20) 45 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన భాగస్వామికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకను ఈ జంట విమానంలో ప్రయాణం చేస్తూ జరుపుకున్నారు.

తాజాగా వారు దుబాయ్‌కి ప్రయాణిస్తున్న విమానంలో తమ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకలో చిరంజీవి, సురేఖ కి వారి సన్నిహితులు బొకేలు అందించి విషెస్ తెలిపారు. ఈ వేడుకలో సినీ స్టార్స్ కూడా ఉన్నారు. అక్కినేని నాగార్జున, అమల, నమ్రత ఘట్టమనేని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఇక తన జీవితానికి వెలుగు తీసుకొచ్చిన తన భార్య, తన వెనకాల ఉండి ఎంతో బలాన్ని, ధైర్యాన్ని అందించిందని.. ఆమె తన జీవితం లోకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చిరు తన భాగస్వామికి విషెస్ తెలిపారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను చిరు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయగా, అభిమానులు సైతం వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles