బాస్‌ సినిమా పై తాజా సమాచారం ఏంటంటే..

Monday, March 31, 2025

మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా గురించి ఇప్పటికే అప్ డేట్ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తాను ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ లో నటించబోతున్నట్లు చిరు క్లారిటీ ఇచ్చారు. ఆ చిత్రం వేసవిలో ప్రారంభమవుతుందని చిరు తెలిపారు. ఈ సినిమా గురించి మెగాస్టార్ ఇంకా మాట్లాడుతూ.. ‘పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఆ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చిరు చెప్పారు.

అయితే, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్‌ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను.

దర్శకుడు కోదండ రామిరెడ్డితో పని చేసిన సమయంలో ఎలాంటి ఫీలింగ్‌ ఉందో.. ఇప్పుడు అనిల్‌తో అలాంటి ఫీలింగే ఉంది. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles