వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు తొలినుంచి ఒక్కటే! మసిగుడ్డ కాల్చి మొహాన పడేయడం.. అవతలి వాళ్లే దాన్ని శుభ్రం చేసుకోవాలని ఎదురుచూస్తూ ఉండడం వారి విధానం. పూర్తి నిరాధార, దుర్మార్గమైన నిందలు వేస్తూ.. తమ ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేయాలని వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ పార్టీలోని అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి, సామాన్య కార్యకర్త వరకు అందరదీ ఒకటే పద్ధతి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత చందంగా.. ఈరకంగా నిరాధార ఆరోపణలతో బురద చల్లడం అనే కార్యక్రమంలో కూడా జగన్ బాటలోనే అందరూ నడుస్తుంటారు. సహజంగానే జగన్ కరపత్రిక ఆ పార్టీలోని ఎవరు ఏం మాట్లాడినా సరే.. ఆ బురదకు తాటికాయంత శీర్షికలు పెట్టి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మద్దతిస్తూ ఉంటుంది.
ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు వైసీపీ నాయకులు ఇలాంటి నిందల్లో తమ ముద్ర చూపిస్తున్నారు. ఆరితేరిపోయారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా నిందలు వేయడానికి వారికి ఇంకో అంశమేదీ దొరకలేదన్నట్టుగా.. చికెన్ విక్రయాల టాపిక్ ఎత్తుకున్నారు. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తన నియోజకవర్గ పరిధిలోని చికెన్ దుకాణాల నుంచి అమ్ముడయ్యే ప్రతి కిలో చికెన్ కు రూ.25 కమిషన్ గా దండుకున్నట్టుగా వారు ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్నవారి మీద నిందలు వేయడానికి ఇంతకంటె వేరే విమర్శలు కూడా చేయవచ్చు. కానీ.. వైసీపీ నాయకుల చవకబారు తనం చికెన్ కమిషన్ల దగ్గరే ఆగిపోయింది. ఈ ఆరోపణల్ని ఖండించిన భూమా అఖిలప్రియ పలుమార్లు ఈ విషయంలో వివరణ ఇఛ్చారు కూడా. కానీ.. వైసీపీ నేతలు ఏమాత్రం తగ్గకుండా.. ఆమె చికెన్ అమ్మకాల్లో కమిషన్లు తీసుకుంటున్నదంటూ పదేపదే విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల గ్రూపుల మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంటున్నది.
ఈ నేపథ్యంలో.. ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఈ ఉద్రిక్తతలకు కారణం అవుతున్నారంటూ.. ఎర్రగుంట్లకు చెందిన నాగప్రసాద్ అనే వ్యక్తి ఆళ్లగడ్డ పోలీసులకు భూమా కిషోర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో భూమా కిషోర్ రెడ్డి అనుచరులు.. మహేశ్వర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మల్లికార్జున్, రుద్రశివనాగిరెడ్డి, ప్రతాపరెడ్డి, అంబటి చంద్రశేఖర రెడ్డి కూడా ఉన్నారు.
నిజానికి వైసీపీ ఆరోపణలు, వారికి చిడతలు వేస్తూ వారి కరపత్రికలో విషప్రచారాలు హద్దు దాటిన తర్వాత.. భూమా అఖిల ప్రియ రఆ పత్రికాఫీసు కార్యాలయం ఎదుట కోళ్లతో కలిసి ధర్నా నిర్వహించారు. మామీద తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారంటూ కోళ్ల మెడలో ప్లకార్డులు కట్టి ధర్నాచేశారు. వైసీపీ పాలన కాలంలో.. పత్రికల్లో వారిపై విమర్శలు వస్తే.. ప్రతికాఫీసుల కార్యాలయాల మీద పడి ధ్వంసం చేసేవారని, తాము శాంతియుత ఆందోళన చేస్తున్నామని ఆమె అన్నారు. ఆ తర్వాత కూడా వైసీపీ ఇలాంటి చవక ఆరోపణలు మానుకోకుండా అతి చేయడం వల్లనే ఇప్పుడు భూమా కిషోర్ రెడ్డిపై కేసు పెట్టేవరకు వెళ్లిందని ప్రజలు అనుకుంటున్నారు.
చికెన్ కమిషన్ల రచ్చ.. భూమా పై కేసు!
Friday, December 5, 2025
