ఛావా వర్సెస్ హరిహర వీరమల్లు! బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎవరినోట విన్నా ఒకటే మూవీ గురించి చర్చ.. అదే ‘ఛావా’. మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాధను ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. ఇక ఈ సినిమాకు ఉత్తరాది రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో శంభాజీ మహారాజ్‌ను మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ చిత్రహింసలు పెట్టే సీన్‌ను చాలా ఎమోషనల్‌గా ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చూపెట్టారు. దీంతో తెలుగు ప్రేక్షకులతో సహా ఇతర రాష్ట్రాల్లో సినిమా లవర్స్ ఔరంగజేబ్ పాత్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఇదే అంశం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’పై ప్రభావం చూపుతుందా.. అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. హరిహర వీరమల్లు సినిమాలో కూడా మొగల్ కాలంలో ఔరంగజేబ్ పాత్రను చూపించబోతున్నారు. ఇక ఈ పాత్రను బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పోషిస్తున్నాడు. ఆయనకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ముగిసింది. మరి ఈ పాత్రను ఈ చిత్రంలో ఎలా చూపించబోతున్నారు.. ఛావా చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు వీరమల్లు మూవీలోని ఔరంగజేబ్ పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారు.. అనేది ఆసక్తికరంగా మారింది.