పనులు చేసే తరీకా నిరూపించనున్న చంద్రబాబు!

Wednesday, January 22, 2025

పరిపాలన అంటే ఎలా ఉండాలో చంద్రబాబునాయుడు ఇప్పటికే రుచిచూపిస్తున్నారు. కేవలం డబ్బులు పంచడం ఒక్కటే పరిపాలన అనుకున్న జగన్మోహన్ రెడ్డి, తతిమ్మా అని ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలను గాలికి వదిలేసినా సరే.. ఏం నష్టం లేదు అనే నమ్మకంతో విర్రవీగారు. రాష్ట్రాన్ని అయిదేళ్లపాటూ సర్వనాశనం దిశగా నడిపించారు. దానికి శాస్తిగా ఇప్పుడు ప్రతిపక్షహోదా కూడా లేని సాధారణ ఎమ్మెల్యేగా ఉణ్నారు. అలాంటి జగన్ కు పరిపాలన ఎలా సాగాలో.. ఇప్పుడు పథకాలతో పాటు అభివృద్ధి పనులు కూడా నడిపిస్తూ చంద్రబాబు మరో పెద్ద ముందడుగు వేశారు. పోలవరం పనులను కూడా జగన్ నిర్లక్ష్యం చేస్తే.. అసలు పనులు చేయించడం ఎలాగో చేసి చూపించడానికి సిద్ధం అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరదాయిని వంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో చంద్రబాబునాయుడు ఎంత శ్రద్ధగా ఉండేవారో తొలివిడత పరిపాలన రోజుల్లోనే రాష్ట్రం గమనించింది. సోమవారం అంటే పోలవారం అని ప్రజలంతా తెలుసుకునేలా చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు.

జగన్ వచ్చిన తర్వాత నవయుగను మార్చి మేఘా సంస్థచేతుల్లో కాంట్రాక్టు పెట్టారు. అయిదేళ్లలో ఏమాత్రం పని జరిగిందో ప్రజలందరూ గమనించారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండగా.. కాఫర్ డ్యాం కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు వచ్చిన తర్వాత.. ఆయన కాంట్రాక్టరును మార్చడం లేదు. అదే మేఘా సంస్థనే కొనసాగిస్తూ డయాఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు

అదే కాంట్రాక్టరు అయినప్పటికీ.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పనులు ఎంత వేగంగా జరుగుతాయో చంద్రబాబు ఇప్పుడు తన చేతలతో నిరూపిస్తున్నారు. జగన్ హయాంలో కూడా పోలవరానికి పెద్దగా నిధుల ఇబ్బంది లేదు గానీ.. పనులు మాత్రం చురుగ్గా సాగలేదు. చంద్రబాబు ఇప్పటికే 12వేల కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి మంజూరు చేయించుకున్న నేపథ్యంలో.. ప్రస్తుతం 7 వేల కోట్లు మంజూరు చేయాలంటూ కేంద్రానికి విన్నవించారు. మేఘా కాంట్రాక్టు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవడానికి ఆలస్యం అవుతుందనే భయంతో.. వేగిరంగా పనులు జరగడానికి వారితోనే కొనసాగిస్తున్నారు. ఈ స్పీడ్ లో.. పనులు పూర్తిచేయడం ఎలాగో చంద్రబాబు నిరూపించబోతున్నారని ప్రజలు ఆశిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles