నీలిదళాల విషప్రచారాలకు చంద్రబాబు షాక్!

Friday, December 5, 2025

రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్నం సంఘటన జరగకూడదు.. బాధితులకు అండగా నిలుస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ.. ఆ వ్యవహారాన్ని అధికారపార్టీ దుర్మార్గానికి నిదర్శనంగా రంగులు పులిమేస్తూ.. డ్రామాలు నడిపించడం అనేది జగన్ దళాలకు బాగా అలవాటు అయిపోయింది. ఒక తప్పు జరిగితే.. దానికి బాధ్యులైన వ్యక్తులు అధికార పార్టీ కార్యకర్తలేనని దుష్ప్రచారం చేయడం కూడా చాలా కామన్ అయిపోయింది. వివాదాలు, ఘర్షణలు పూర్తిగా వ్యక్తిగత ప్రెవేటు కారణాల వల్ల చోటు చేసుకున్నా కూడా వాటికి రాజకీయ రంగు పులమడం.. తద్వారా అధికార పార్టీ మీద బురద చల్లడం అనేది వైసీపీ దళాలకు నిత్యకృత్యం అయింది. కుప్పం ఘటన విషయంలో కూడా వారు అదే దుర్మార్గానికి ఒడిగట్టారు.
ఇంతకూ కుప్పంలో ఏం జరిగిందంటే.. రెండు కుటుంబాల మధ్య 80 వేల రూపాయల అప్పునకు సంబంధించిన తగాదా ఉంది. అప్పు తీసుకున్న వ్యక్తి పారిపోయాడు. ఆయన భార్య కూడా బెంగుళూరులో స్థిరపడింది. అయితే కుప్పం వచ్చిన ఆమెను అప్పు ఇచ్చిన వారు చెట్టుకు కట్టేసి కొట్టారు.
కొట్టిన వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త అంటూ జగన్ దళాలు పెద్ద ఎత్తున విషప్రచారం ప్రారంభించాయి. అయితే.. ఏ తప్పు జరిగినా సరే.. తన సొంత కుటుంబం అని కూడా చూడకుండా చట్టప్రకారం వారి మీద చరన్యలకు ఉపక్రమించే తన వ్యవహార సరళిని చంద్రబాబునాయుడు ఈ విషయంలో కూడా నిరూపించుకున్నారు. ఒకవైపు తెలుగుదేశం కార్యకర్త దాష్టీకం చేసినట్టుగా జగన్ దళాల విషప్రచారం సాగుతుండగానే.. దానిని పట్టించుకోకుండా ఆయన తన ప్రభుత్వం బాధిత మహిళకు ఏం చేయగలదో అంతా చేశారు. నేరానికి పాల్పడిన వ్యక్తిపట్ట ఎలా వ్యవహరించగలదో ఆ చర్యలన్నీ తీసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళకు రూ.5 లక్షల సాయం ప్రకటించి అప్పుల ఊబినుంచి బయటపడడానికి ఆదుకోవడం విశేషం. పైగా ఆమెతో స్వయంగా వీడియో కాల్ లో మాట్లాడి.. ధైర్యంగా ఉండాల్సిందిగా భరోసా ఇచ్చారు. చంద్రబాబు మాత్రమే కాదు.. హోంమంత్రి అనిత కూడా బాధితురాలితో ఫోనులోమాట్లాడి ధైర్యం చెప్పారు. మరోవైపు ఈ నేరం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండుకు మదనపల్లె జైలుకు తరలించడం కూడా జరిగింది.

కుప్పంలో మహిళ మీద దాడిచేసిన వ్యక్తి తెలుగుదేశం అవునో కాదో.. సాక్షి విషప్రచారంమ నిజమో కాదో తర్వాతి సంగతి! కానీ తన రాష్ట్రంలో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే తన పార్టీ వారైనా సరే.. సన్నిహితులైనా సరే విడిచిపెట్టేది లేదని చంద్రబాబునాయుడు మరోమారు నిరూపించారు. గతంలో వైఎస్ భారతి మీద అనుచిత పోస్టులు పెట్టినందుకు తెలుగుదేశం ఐటీ విభాగానికి చెందిన కార్యకర్తను కూడా అరెస్టు చేయించి జైలుకు పంపిన చరిత్ర బాబు ప్రభుత్వానికి ఉంది. తన సొంత చెల్లెల్లు, సొంత తల్లి మీద అసభ్యపు నీచమైన కారుకూతలను సోషల్ మీడియాలో పోస్టులుగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి  జగన్మోహన్ రెడ్డి కాగా.. తన ప్రత్యర్థి పార్టీకి చెందిన మహిళల పట్ల అయినా సరే.. తెలుగుదేశం కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించినా, తప్పులు చేసినా.. ఊరుకునేది లేదని చంద్రబాబునాయుడు ప్రభుత్వం చాలా స్పష్టంగా నిరూపించుకుంది. ఇప్పుడు కుప్పంలో కూడా చంద్రబాబు అదే తరహాలో మహిళలకు భరోసా కల్పించేలా తన ముద్ర చూపించారని ప్రజలు అభినందిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles