ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మార్కు సంక్షేమం అంటే ఏమిటో చూపించనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తానన్న హామీని ఆగస్టు 15 వతేదీనుంచి అమల్లోకి తేనున్నట్టుగా చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా పలువురు రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులు చేపడుతున్న పథకాలకంటె కొంత ఎక్కువగా ప్రకటించి తాము అమలు చేస్తాం అని ప్రజలకు చెబుతుంటారు. కానీ, చంద్రబాబునాయుడు తాను ఇచ్చిన హామీనే మరింతగా ఉన్నతీకరించి.. మరింత మెరుగ్గా ఆ పథకాన్ని అమలు చేస్తానని చెప్పడం విశేషం.
ఆర్టీసీ బస్సుల్లో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం గురించి చంద్రబాబునాయుడు 2023 మహానాడు సందర్భంగానే హామీ ఇచ్చారు. అదే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరగ్గా.. చంద్రబాబు హామీనే కాపీ కొట్టి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారు. ముందుగా తెలుగు మహిళలకు అలాంటి హామీ ఇచ్చినది మాత్రం చంద్రబాబే. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును అధ్యయనం చేయించిన తర్వాత చంద్రబాబునాయుడు.. ఆగస్టు 15 నుంచి ఆ పథకాన్ని కార్యరూపంలోకి తీసుకురానున్నారు.
అయితే ఇక్కడ ఓ సంగతి ప్రత్యేకంగా గమనించాలి. ఇచ్చిన మాటకంటె ఆయన మెరుగ్గా ఈ పథకం అమలు చేయబోతున్నారు. 2023 మహానాడులో గానీ, 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా గానీ.. చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినది మహిళలకు జిల్లా పరిధి వరకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడానికి మాత్రమే. కానీ.. ఇప్పుడు ఆ హామీని ఉన్నతీకరించి అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించడానికి చంద్రబాబు సర్కారు నిర్ణయించినట్టుగా సమాచారం. నిజానికి ఇది చాలా పెద్ద వ్యత్యాసం అవుతుంది. మహిళల జీవితాల్లో గుణాత్మకమైన మార్పునకు కూడా ఇది దారితీస్తుంది. మహిళాలోకంలో చంద్రబాబు సర్కారు నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మామూలు పరిస్థితుల్లో జిల్లా స్థాయి వరకు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే.. ఆర్టీసీకి చెల్లించాల్సి వచ్చే సొమ్ము రూపేణా ప్రభుత్వం మీ 300 కోట్ల వరకు ఏడాదికి భారం పడవచ్చునని అప్పట్లో అంచనా వేశారు. అయితే.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ సదుపాయం కల్పించాలని అనుకోవడం వల్ల.. ప్రభుత్వం మీద 3200 కోట్ల రూపాయల మేర భారం పడవచ్చునని అంచనా వేస్తున్నారు. అంటే జిల్లా స్థాయికంటె రాష్ట్ర స్థాయి వలన దాదాపు పదిరెట్లకు పైగా భారం పడనుంది. ఇచ్చిన మాట కంటె మెరుగ్గా అమలు చేయాలనులకోవడం ద్వారా చంద్రబాబు తన ముద్ర చూపించనున్నారు.
ఇచ్చిన మాటకంటె మెరుగ్గా చేయనున్న చంద్రబాబు!
Friday, December 5, 2025
