జగన్ దైవ ద్రోహాన్ని సరిదిద్దిన చంద్రబాబు! 

Monday, December 15, 2025

పంచె కట్టుకొని, బొట్టు పెట్టుకుని, దేవదేవుడి దర్శనానికి ఒక ఫ్యాన్సీ డ్రెస్ ప్రదర్శన లాగా వెళ్ళినంత మాత్రాన హిందుత్వం పట్ల గౌరవం ఉన్నట్టు కాదు. తిరుమల వెంకటేశ్వర స్వామి కి ఉన్న ఆధ్యాత్మిక వైశిష్ట్యం పట్ల భక్తి ప్రపత్తులు వ్యక్తమైనట్లు కాదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా తిరుమల ఆధ్యాత్మిక ప్రాధాన్యానికి గండి కొడుతూ.. మరొకవైపు ముఖ్యమంత్రి హోదాలో స్వామిని దర్శించుకోవడానికి ఒంటరిగా వస్తూ ఉండిన జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన దైవ ద్రోహాన్ని చంద్రబాబు నాయుడు చక్కదిద్దారు. తిరుమల గిరుల పాదాల చెంత అలిపిరి పక్కనే ఏకంగా 20 ఎకరాల భూమిలో మద్య మాంసాల విక్రయాలకు, సకల అరాచక కార్యకలాపాలకు నెలవుగా మారగల స్టార్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను ఆయన రద్దు చేశారు. తిరుమల దైవత్వాన్ని దెబ్బతీసేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులపై హిందూ సంఘాల పోరాటాలకు ఆయన విలువ ఇచ్చారు. తిరుపతిలో  స్వామి భక్తుల మనోభావాలను గాయపరచకుండా ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

తిరుమల గిరులు, ఏడుకొండలు వేంకటేశ్వరస్వామి సొంతం అని.. వీటిని ఇతరులెవ్వరూ వ్యాపార కార్యకలాపాలకు వాడడానికి వీల్లేదని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రఖ్యాత దేవాలయాలకు సీఎంగా పట్టువస్త్రాలు సమర్పించవలసి వచ్చే సందర్భాల్లో మాత్రమే హిందూ వేషధారణలో నాటకీయ ప్రదర్శనలాగా వస్తుండేవారు. ప్రత్యేకించి.. తిరుమల స్వామివారికి బ్రహ్మోత్సవాల సమయంలో సతీసమేతంగా ముఖ్యమంత్రి వచ్చి వస్త్రాలు సమర్పించడం సాంప్రదాయం కాగా.. అయిదేళ్లలో ఎన్నడూ జగన్ దానిని పాటించలేదు. ఆయన భార్యా సమేతంగా ఒక్కసారి కూడా తిరుమలకు రాలేదు. అలాగని భార్య భారతి అసలు హిందూత్వానికి దూరంగా ఉంటూవచ్చారని అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే.. ఉగాది, సంక్రాంతి వంటి పండుగలు వచ్చినప్పుడు.. చెవిరెడ్డి భాస్కర రెడ్డి చేసే హడావుడితో.. తాడేపల్లి ప్యాలెస్ వద్దనే ఆలయాల సెట్టింగులు వేయించి.. తిరుమల ఆలయ పూజారులను పిలిపించి.. నానా హడావుడి చేసేవారు. ఆ సందర్భాల్లో మాత్రం.. భారతి, జగన్ వెంట వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 

అంటే.. దేవుడు తమ ఇంటి ఆవరణలోని సెట్టింగుల్లోకి వస్తే మాత్రం ఆమె హిందూ వేషంలో భర్త వెంట పూజల్లో ఉంటారు గానీ.. తిరుమల ఆలయానికి మాత్రం ఎన్నడూ కనీసం అక్కడి సాంప్రదాయాన్ని గౌరవించడానికైనా వెళ్లేవారు కాదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి.. తిరుమల గిరుల ప్రాశస్త్యానికి గండికొట్టేలాగా.. స్వామివారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ అనే వివాదాస్పద హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, హిందూ సంఘాలు గగ్గోలు పెట్టినా.. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. ధర్మానికి ఆయన చేస్తున్న చేటుకు మొత్తానికి చంద్రబాబు వచ్చిన తర్వాత.. చెక్ పెట్టారని.. భక్తుల మనోభావాలను గౌరవించారని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles