ఎక్కడ తగ్గాలో..’ సూత్రం పాటిస్తున్న చంద్రబాబు!

Sunday, December 22, 2024

ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మహానుభావుడు అంటూ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో ఒక డైలాగు ఉంటుంది. చంద్రబాబునాయుడు ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిస్తున్నారు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం పోటీచేయడం గురించి చంద్రబాబునాయుడు పునరాలోచనలో పడిన నేపథ్యంలో పార్టీలో ఇలాంటి చర్చ జరుగుతోంది. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని పార్టీ వారు అంటున్నారు.
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ ఓట్లు చీలిపోకుండా.. వైఎస్సార్ కాంగ్రెస్ శిబిర రాజకీయాలను ప్రారంభించింది. స్థానిక ప్రతినిధుల్ని కుటుంబాలతో సహా బెంగుళూరులో విహారయాత్రలకు తిప్పుతోంది. వారిలో చాలా మంది అధికార కూటమి పార్టీల్లో చేరడానికి ఆల్రెడీ ఒక విడత మంతనాలు పూర్తి చేసుకున్న వారే అయినప్పటికీ.. ప్రస్తుతం జగన్ క్యాంపుల్లో చిక్కుకుపోయారు.

ఈనేపథ్యంలో పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపితే అనుకున్నన్ని ఓట్లు వైసీపీనుంచి తమకు రావడం సాధ్యమేనా? అనే అనుమానం పార్టీలో మొదలైంది. కొందరు విశాఖ కార్పరేటర్లు వచ్చినప్పటికీ.. ఇంకా చాలా ఓట్లు కావాల్సి ఉన్నందున.. ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం వందల ఓటర్ల ఫిరాయింపు మీద ఆశపెట్టుకోకుండా.. పోటీకి దిగకుండా వదిలేయడం బెటర్ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పార్టీని పోటీకి దింపడం వలన ఒక ఎడ్వాంటేజీ ఉంటుందనే వాదన కూడా ఉంది. వీలైనంత మంది స్థానిక నేతలు తమ వైపు మొగ్గే అవకాశం ఉంటుందని.. గెలవకపోయినాసరే.. తమ పార్టీ బాగా పెరుగుతుంది కదా అని కొందరు అంటున్నారు. పోటీకి దిగి ఓడిపోవడం కంటె.. మిన్నకుండడం మేలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే.. బొత్స సత్యనారాయణకు మేలు జరిగినట్టే.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా గెలిచినంత మాత్రాన.. బొత్స సత్యనారాయణకు ఒరిగే లాభం ఇసుమంతైనా ఉండదని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles