వైసీపీ విషపురుగులపై చంద్రబాబు ఔదార్యం!

Sunday, January 26, 2025

మనదేశంలోని ప్రజలకు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి హక్కు ఉంటుంది. తాము ఏమి అనుకుంటున్నారో  బయటకు చెప్పడం అనేది వారి ప్రాథమిక హక్కు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించిన రోజుల్లో ప్రజల ప్రాథమిక హక్కులకు కూడా పాతర వేశారు.  విచ్చలవిడిగా వారి మీద కేసులు పెట్టి వేధించారు. ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారాలు కాదు.. కేవలం అభిప్రాయాలు చెప్పినా.. ఇతరులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను తాము షేర్ చేసినా కూడా వారి మీద దారుణమైన సిఐడి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. వయసు తేడాలు కూడా చూడకుండా 60 ఏళ్లు దాటిన మహిళలను కూడా ఇలాంటి సిఐడి కేసులతో ఇబ్బంది పెట్టడం జగన్ కు మాత్రమే చెల్లింది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇలాంటి విషయంలో తన హుందాతనాన్ని, ఔదార్యాన్ని, పెద్ద మనసును చాటుకుంటున్నారు. ప్రభుత్వం మీద మీ అభిప్రాయాలు అభిప్రాయాల్లాగా ఎన్నైనా పోస్ట్ చేసుకోండి అని చంద్రబాబు చెప్పడం సోషల్ మీడియాలో చెలరేగే వారికి కూడా చిత్రంగా కనిపిస్తోంది.

జగన్ పరిపాలన రోజులలో ఎలా ఉండేదో.. కేసులు ఎలా పెట్టే వాళ్ళో గుర్తు చేసుకోండి! ‘విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన జగన్, అమరావతిని పట్టించుకోవడం లేదు’ అని పోస్ట్ పెట్టినందుకు సిఐడి కేసులు నమోదు కావడం అప్పట్లో చూశాం. ఇప్పుడు ఒకవైపు వరద సహాయక చర్యలలో ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై అద్భుతమైన సేవలు అందిస్తున్నప్పటికీ కూడా.. ఒక్కరికి కూడా సాయం అందలేదని, పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారని.. రకరకాల తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ దళాలు వ్యాప్తి చెందించాయి. ఇలాంటి ఏ నీచప్రచారాన్ని కూడా చంద్రబాబు నాయుడు అంత సీరియస్ గా పట్టించుకోలేదు. జగన్ తరహాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట మీద కేసులు పెట్టదలుచుకుంటే ఈపాటికి వైసిపి సోషల్ మీడియా దళాల వారందరూ కూడా జైల్లో ఉండేవారు. పైగా వరద లాంటి విపత్కర సమయాలలో ఇలాంటి ప్రచారం ద్వారా ప్రజలను భీతావహుల్ని చేసే దుర్మార్గానికి మరింత పెద్ద శిక్షలు కూడా పడి ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు వీరి తప్పుడు ప్రచారాలను లైట్ తీసుకున్నారు.

అయితే ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేసే తరహాలో ప్రచారాలను మొదలుపెడితే మాత్రం ఆయన ఊరుకోలేదు. గట్టిగా హెచ్చరిస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేస్తున్నదని, సోమవారం నాడు తెలుగుదేశం కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారని సోషల్ మీడియాలో సాగిన ప్రచారం పట్ల చంద్రబాబు నాయుడు గుస్సా అయ్యారు. ‘మేం రాజీనామా చేయాలని మీ ఉద్దేశం,  మీ కోరిక అయితే దానిని మీ అభిప్రాయం కింద రాసుకోండి’ అంటూ చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా పురుగులకు సూచన కూడా చేశారు. ఆ రకంగా సోషల్ మీడియా విషపు పురుగుల పట్ల కూడా తన ఔదార్యం చూపించారు. అంతేతప్ప తప్పుడు ప్రచారాలతో ప్రభుత్వాన్ని కూల్చేయాలని అనుకుంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మంచితనం చూసైన సరే.. జగన్ విసిరే బిస్కెట్లకు ఆశపడి తప్పుడు ప్రచారాలు సాగించే పేటీఎం బ్యాచ్ దళాలు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles