Telugu News

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తదుపరి కవిత అరెస్ట్?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ అగ్రనేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ కావడంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దానితో తదుపరి అరెస్ట్ ఎవ్వరని తెలుగు రాష్ట్రాలలో...

డిజిపి చేద్దామనుకున్న సునీల్ కుమార్ పై జగన్ వేటు వేస్తారా!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు పెద్ద చిక్కు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు రాష్ట్ర పోలీస్ లో తిరుగులేని అధికారిగా వ్యవహరిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తూ సీఎం జగన్...

జ‌గ‌న్ స‌ర్కారుపై ’ఉద్యమ శంఖారావం‘ ప్రకటించిన ఉద్యోగులు

తమ పట్ల వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న‌ ఉదాసీన వైఖరికి నిరసనగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తిరుగుబాటును ప్రకటించారు. ప్రత్యక్ష  ఉద్యమ కార్యాచరణను ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు...

బీజేపీలో చేరేందుకు రాజ్యసభ సీటు కోరుతున్న జేడీ లక్ష్మీనారాయణ!

ఒక వంక వచ్చే ఎన్నికలలో విశాఖపట్నం నుండి లోక్ సభకు పోటీ చేస్తానని చెబుతూ, ఏదైనా పార్టీ మద్దతు ఇస్తే సరే, లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్న మాజీ సిబిఐ...

జగన్ సర్కారు.. ఒక స్వామీజీ కథ!

జగన్ సర్కారు  పరిపాలన ఎలా సాగుతున్నదో తెలియాలంటే.. ముందుగా ఈ కథ చదవాల్సిందే.. ‘‘అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు. అతడిది చీకూ చింతా లేని చిన్న కుటుంబం. రోజులు నిమ్మళంగానే గడచిపోతున్నాయి....

మళ్లీ మంత్రిపదవిపై ఆశ ఉందా కొడాలీ!

తెలుగుదేశం పార్టీని తూలనాడాలంటే, చంద్రబాబు నాయుడును నారా లోకేష్ ను అసహ్యమైన రీతిలో బూతులు తిట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రయోగించే అస్త్రం పేరు కొడాలి నాని. ఒక ప్రజా నాయకుడిగా,...

తెతెదేపాకు కొత్త వైభవం రానున్నదా?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబునాయుడు ఫోకస్ పెంచుతున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ పగ్గాలు స్వీకరించిన తర్వాత.. పార్టీ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఖమ్మంలో భారీ బహిరంగ సభతో తెలంగాణలో పార్టీకి ఇంకా...

సిసోడియా అరెస్టుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు!

 ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు అయ్యారు.  ఆదివారం నాడు ఏకంగా ఎనిమిది గంటల పాటు సిసోడియాన్ విచారించిన సిబిఐ పొద్దుపోయిన తర్వాత అరెస్టు చేసింది.  అయితే...

కదిరిలో జనం భుజాలపైకి ఎక్కి మీసం మెలేసి, తొడకొట్టిన సీఐ!

వైఎస్ జగన్ పాలనలో పోలీసుల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతుంది. అధికార పక్షం నేతల మెప్పు పొందేందుకు తమ విద్యుక్తధర్మాలను మరచిపోయి, అసాంఘిక శక్తుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తపైన తమ...

తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి ఎన్నికలలో పోటీచేస్తారా!

నందమూరి తారకరత్న సినిమాపరంగా చెప్పుకోదగిన విజయం సాధింపలేకపోయినా ఆయన అకాలమరణం చెందటం నందమూరి కుటుంబంలో, టిడిపి శ్రేణులలోనే కాకుండా సాధారణ ప్రజలలో సహితం విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా తారకరత్న నిజాయితీ, స్నేహ...

వివేకా హత్య కేసులో రూ 40 కోట్ల సూపారిపై సిబిఐ దృష్టి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. హత్యకు  పథక రచన చేసిన సూత్రధారులేవరో తేలిపోయిందని ఇటీవల జరుగుతున్న విచారణల ధోరణి...

అసెంబ్లీకి పోటీ చేసేందుకై తెలంగాణ ఎంపీల క్యూ!

ఈ సంవత్సరం చివరిలోగా జరునగున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఇద్దరు, ముగ్గురు తప్పా మిగిలిన ఎంపీలందరూ, పార్టీలకు అతీతంగా సిద్దపడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలలోని కీలక నేతలు పార్లమెంట్...

పరువు తీసేలా కాంగ్రెస్‌లో ముసలితనం చర్చ!

కాంగ్రెస్ పార్టీలో అందరూ ముసలి నాయకులే తయారయ్యారు. పార్టీని వాళ్లు వీడిపోవడం లేదు. పార్టీని వారు ముందుకు కూడా పోనివ్వడం లేదు.. అనేది చాలా కాలగా ఆ పార్టీ వర్గాల్లోనే ఉండే అభిప్రాయం....

తెలుగు రాష్ట్రాల ఆస్తుల విభజనపై పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నా విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగవలసిన ఆస్తుల విభజన గురించి కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండగా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు...

మోసపోలేం.. కాంగ్రెస్ హామీని నమ్మేదెలా?

 అవసాన దశలో ఉన్నప్పుడు అందరూ నీతులు మాత్రమే మాట్లాడతారు.   అవకాశం లేనప్పుడు ప్రతి ఒక్కరూ పాతివ్రత్య డైలాగులు మాత్రమే వల్లిస్తారు.  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలలో చేసిన తీర్మానం తెలుగు...

కేసీఆర్ కు టీడీపీ నుండి పెను ముప్పు తప్పదా!

ఖమ్మంలోటిడిపి జరిపిన బహిరంగసభకు అనూహ్య ప్రజా స్పందన లభించడంతో తెలంగాణ రాజకీయాలలో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు వర్గాలలో తిరిగి టిడిపి వైపు ఆసక్తి వ్యక్తం అవుతున్నది. ఈ స్పందన ఎన్నికల...

లోకేష్ ను వెంటాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ నీడ!

తండ్రి వారసత్వంగా తెలుగు దేశం పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగేందుకు నారా లోకేష్ చేపట్టిన `యువగళం' పాదయాత్రలో పలుచోట్ల జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ అంశం...

ఎన్నికల కమీషన్ నుండి జగన్ కు చిక్కులు తప్పవా!

శివసేన గుర్తు, పేరు విషయంలో ఉద్ధవ్ థాకరే, ఎకనాథ్ షిండే వర్గాల మధ్య ఏర్పడిన వివాదంలో వాటిని షిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఆ పార్టీ రాజ్యాంగంపై చేసిన సునిశిత విమర్శలు...

నానా కష్టాలు పడినా.. ఫలం దక్కలేదు!

‘వ్రతం చెడినా.. ఫలం దక్కింది’ అని సామెత. కానీ వర్తమాన రాజకీయంలో దీనిని కొంచెం తేడాగా చదువుకోవాలి. నానా కష్టాలు పడి వ్రతం పూర్తి చేసినా కానీ ఫలం మాత్రం దక్కలేదు. వైయస్సార్...

చంద్రబాబుపై నిందలా? సజ్జలలో ఇంత వక్రబుద్ధి ఎలా?

ప్రజలు నవ్వుతారనే భయం సజ్జలకు లేదా? సిబిఐ అధికారులు- వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని రెండోసారి పిలిపించి ఏకంగా నాలుగున్నర గంటల పాటు విచారించిన తరువాత..  వైఎస్ఆర్...

శెభాష్ లోకేష్.. ఈ హామీ జగన్ ఇవ్వగలడా?

నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ, వాస్తవమైన అభివృద్ధి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ ఏం చేయగలదో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో నారా...

కన్నా వైకాపా వికెట్లను రాలుస్తారా?

తెలుగుదేశం పార్టీలోన చేరిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వలన ఆ పార్టీకి ఎలాంటి లాభం జరగబోతోంది? ఆయన ఏ పార్టీల నుంచి నాయకులను ప్రభావితం చేసి, వారిని తెలుగుదేశంలోకి తీసుకురావడానికి ఉపయోగపడతారు?...

కేసీఆర్ కలలకు ఇలా గండిపడుతుందా?

దేశమంతా విస్తరించడానికి కర్ణాటక ఎన్నికలతో శ్రీకారం చుట్టాలని భారాస అధ్యక్షుడు కేసీఆర్ కలగంటున్నారు. కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లోనే తమ అస్తిత్వం నిరూపించుకోబోతున్నట్లుగా ఇదివరలోనే స్పష్టం చేశారు. అక్కడ కుమారస్వామి భారాసకు మద్దతు పలు...

సిబిఐపై ఎదురు దాడులు ప్రారంభించిన జగన్ బృందం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సిబిఐ వేగంగా అడుగులు వేస్తూ, కీలక వ్యక్తుల పాత్రను నిర్ధారించే ప్రయత్నంలో ఉంటూ, త్వరలో కేసును ముగింపుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో సీఎం...

జగన్ తిరిగి సీఎం పదవి కోసం కురుక్షేత్రలో వారాహి యజ్ఞం!

ఏపీలో రాబోయే ఎన్నికల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో పర్యటనకు తలపడుతుంటే ఎగతాళి చేస్తున్న వైసీపీ, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం కోసం...

జగన్ కు బాసటగా బీజేపీ అధిష్ఠానం… `అసమ్మతి’ ఢిల్లీ యాత్రలో చుక్కెదురు!

`సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించండి.. ఏపీలో బీజేపీని కాపాడండి' నినాదంతో ఢిల్లీకి వెళ్లిన ఏపీ అసమ్మతి నేతలకు చుక్కెదురైంది. రాష్ట్రంలో బీజేపేని కాకుండా సీఎం వైఎస్ జగన్ అధికారాన్ని కాపాడటం కోసమే...

చంద్రబాబుతో చేరిన కన్నాకు రాయపాటి నుండి ముప్పు!

వారం రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరడం రాజకీయాలలో `శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు' ఉండరనే నానుడిని...

కమలంలో సోము చాలా స్ట్రాంగ్ గురూ!

సోము వీర్రాజు ఇప్పటివరకూ తన రాజకీయ జీవితంలో.. తాను ప్రజాబలం ఉన్న నాయకుడిగా నిరూపించుకున్న ఉదంతం లేదు. సర్పంచిగా కూడా ఓడిపోయిన చరిత్ర ఆయనకు ఉంది. కానీ, భారతీయ జనతా పార్టీలో మాత్రం...

కోటంరెడ్డి  టిడిపికి అవసరం..  ఎందుకంటే?

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని...

పవన్ ను దెబ్బతీయటమే కెసిఆర్ లక్ష్యమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి చురుగ్గా అడుగులు వేస్తోంది.  రాష్ట్రంలో తమ పార్టీ విస్తరణ కోసం సొంతంగా నమస్తే ఆంధ్ర ప్రదేశ్ పేరుతో ఒక పత్రికను కూడా ప్రారంభించాలని నిర్ణయించిన పార్టీ...

నామినేషన్ వేయాలంటే శ్మశానం గోడదూకి వెళ్లాలా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పోలీసులను ఎంత అరాచకంగా వాడుకుంటున్నారో.. ప్రజాస్వామిక విలువలను, పద్ధతులను ఏ రకంగా తుంగలో తొక్కేస్తున్నారో తెలియజెప్పే సంఘటనలు గురువారం నాడు చోటు చేసుకున్నాయి.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మద్దతుతో...

పత్రిక పెడితే అంత ఈజీగా గెలిచిపోతారా?

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి అనుకూలంగా సేవలు అందించడానికి ఒక కొత్త పత్రికను ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఏపీలో త్వరలో నమస్తే ఆంధ్ర ప్రదేశ్...

నాట్ జస్ట్ గుంటూరు.. స్టేట్ మొత్తం డ్యూటీ..!

కన్నా లక్ష్మీనారాయణ చేరికతో తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీకి ఖచ్చితంగా అదనపు బలం చేకూరినట్టేననే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. రాయపాటి సాంబశివరావు వంటి కొందరు వ్యతిరేకించినప్పటికీ.. చంద్రబాబునాయుడు, కన్నా...

సంకీర్ణ సారథ్యంపై కాంగ్రెస్ కక్కుర్తి!

కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రస్తుతం శవాసనం వేసి ఉన్న మాట వాస్తవం. ఆ పార్టీ తిరిగి బతికి బట్టగడితే చాలు.. పూర్వవైభవం సంగతి నెమ్మదిగా ఆలోచించుకోవచ్చు.. అనేది పార్టీలోని అనేకమంది అభిప్రాయంగా...

ఇప్పుడే నిద్ర లేచి మాట్లాడుతున్న కొడాలి నాని!

 వెనకటికి ఒక కోడిపుంజు నేను కోత వేయకపోతే ఊరు నిద్ర లేవదు అని అనుకున్నది.  ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో మాజీ మంత్రి కొడాలి నాని పరిస్థితి కూడా అంతకంటే భిన్నంగా ఎంత మాత్రమూ...

షర్మిలను కూడా సిబిఐ విచారణకు పిలుస్తుందా?

వైయస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకరాలు తెలంగాణలో వైయస్సార్ వారసురాలిగా అధికారం దక్కించుకుంటానని ప్రతిజ్ఞతో పాదయాత్ర చేస్తున్న షర్మిలను సిబిఐ విచారణకు పిలుస్తుందా?  ఆమె ద్వారా కొన్ని సాక్ష్యాలను నమోదు చేస్తుందా?  వైయస్ వివేకానంద...

ముందస్తు ఎన్నికలపై కేటీఆర్, హరీష్ లతో కేసీఆర్ మంతనాలు

రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా 2018లో మాదిరిగా వరుసగా మూడోసారి కూడా విజయం సాధించాలని సిద్ధపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు కనిపిస్తున్నది. ముందస్తు కోసమే మార్చిలో జరుగవలసిన...

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా!

ఎపి సిఎం వైయస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ స్వయంగా పేర్కొనడం కలకలం రేపుతోంది....

జగన్ ఉగ్రవాదంపై తిరుగుబాటుకు చంద్రబాబు పిలుపు

రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వ అరాచక, విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు....

కొత్త గవర్నర్ కు పరీక్షగా మారనున్న గన్నవరం ఘటన!

పోలీసుల కళ్ల ఎదురుగానే టిడిపి కార్యకర్తలను టీడీపీ కార్యాలయం వద్దనే కొడుతూ, టిడిపి కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన  ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్ కు వెళ్లిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిని...

ముసుగు వీరులతో ఇస్తున్న సందేశం ఏమిటి?

అరెస్టు చేసిన నేరస్తులను పోలీసులు కొట్టడం అనేది చరిత్రలో ఎన్నడూ ఎరగని విషయం ఇంత మాత్రం కాదు.  చాలా సందర్భాల్లో నిజం రాబట్టడానికి పోలీసులు నేరగాళ్లను చితక్కొడుతుంటారు.  దండం దశగుణం భవేత్   ...

కేంద్ర మంత్రి పదవి రాలేదని అసహనంగా తమిళసై!

తెలంగాణ గవర్నర్ గా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో వ్యవహరిస్తున్న డా. తమిళసై సౌందరరాజన్ అసంతృప్తికి కేసీఆర్ కన్నా బిజెపి అధిష్టాన వైఖరి కారణంగా స్పష్టం అవుతుంది. రాజ్యసభకు పంపి, తనను కేంద్ర...

కర్ణాటకలో 25 సీట్లలో పోటీకి కేసీఆర్ సిద్ధం!

జాతీయ పార్టీగా బిఆర్ఎస్ ను ప్రకటించిన తర్వాత మొదటిసారిగా మరో మూడు, నాలుగు నెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి...

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిపై విచారణకు సిబిఐ పట్టు

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వరుసగా సిబిఐ నుండి షాక్ లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కడప ఎంపీ వ.ఎస్ అవినాష్ రెడ్డిని బాబాయి వివేకానందరెడ్డి హత్యా కేసులో రెండు సార్లు విచారణకు పిలిచింది. పైగా,...

జేడీ లక్ష్మీనారాయణ: వాట్ ఏ కాన్ఫిడెన్స్ సర్ జీ!

ఎంసెట్ పరీక్ష లాంటిది రాస్తున్నప్పుడు ఎంత కష్టపడి చదివినా సరే టార్గెట్ చేసిన ర్యాంకు కొట్టడం మిస్ అయిన విద్యార్థి.. ఒకసారి లాంగ్ టర్మ్ వెళ్లి మళ్లీ ప్రయత్నించాలి అనుకుంటాడు. ఏడాది పాటు...

వేటు తప్పదని తెలిశాక త్యాగరాజు బిల్డప్పులు!

ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం పూర్తయి వారు అధికారికంగా పదవుల్లోకి వచ్చిన వెంటనే ఒకసారి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందనే వార్త కొన్ని వారాలుగా వినిపిస్తోంది. కులాల సమీకరణలు సమతూకంతో కనిపించేలాగా, పార్టీ ప్రతిష్ట...

రేవంత్ భజనలోనే భవిష్యత్తు.. ఫిక్సయిన కొండా!

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఎంతో సాన్నిహిత్యం వున్నది గనుక, కొండా సురేఖ కాస్త వ్యూహాత్మకంగా సరైన సమయం చూసుకొని షర్మిల ప్రారంభించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరుతుందనే ఊహ ఎవరికైనా ఉన్నట్టయితే...

చంద్రబాబు లాజిక్ జగన్‌కు చేటు చేస్తుందా?

ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాష్ట్రంలో రాజుకుంటున్న తరుణంలో చంద్రబాబునాయుడు ఒక మంచి లాజిక్ తెరమీదకు తెచ్చారు.అసలు శాసనమండలి అన్నదే ఉండడానికి వీల్లేదని, దానిని తక్షణం రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం...

ఎమ్మెల్సీ రిజల్ట్స్ : ఒక సెగ్మెంటులో సమాధి కట్టినట్టే!

18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఎంత ఒత్తిడికి గురయ్యారో ఎవరికీ తెలియదు గానీ.. చాలా కంగారు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. గతంలో తాను ఎవరెవరికి చాలా స్ట్రాంగుగా...

భూకబ్జా ఆరోపణలలో సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షునిగా వైసీపీ ప్రభుత్వం పట్ల తన `స్వామి భక్తి'ని ప్రదర్శించుకోవడంకోసం నిత్యం తాపత్రయపడుతూ ఉండే సోము వీర్రాజును వివాదాలు మాత్రం వదలటం లేదు. నిత్యం ఏదోఒక వివాదంలో చిక్కుకొంటున్నారు. సొంతపార్టీ...
Popular