నిజాలపై కేసులు.. విషం కక్కినా చర్యలు నో

Wednesday, December 18, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి.. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం గురించి.. నిజాలు మాట్లాడుతూ తమ ప్రభుత్వపు బండారాన్ని బట్టబయలు చేస్తున్న తీరు గురించి భయంతో.. ఎన్నికల సంఘానికి ఒక తప్పుడు ఫిర్యాదు చేస్తే తక్షణం చర్యలు తీసుకోవడానికి ఈసీ రంగంలోకి దిగింది. అదే సమయంలో ప్రతిపక్షాల మీద వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన దళాలు అచ్చంగా విషం కక్కుతున్నప్పటికీ.. నామమాత్రంగా స్పందించడానికి కూడా ఈసీ పూనుకోవడం లేదు. చర్యలు తీసుకోవడం లేదు. ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్లి గమనిస్తే..

ల్యాండ్ టైటిలిగ్ యాక్ట్ అనేది ఎంతటి దుర్మార్గమైన చట్టమూ ప్రజలందరూ నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు. ఈ చట్టం కారణంగా.. భూములపై యాజమాన్య హక్కులు పేర్లు మారిపోవడం.. రాష్ట్రంలో ఆకారణంగా కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవడం వంటి వ్యవహారాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో చట్టంలో ఉన్న దుర్మార్గమైన నిబంధనల గురించి.. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ వారి వారి పార్టీ నాయకులు ప్రజలకు అవగాహన కలిగించడానికి తమ సభలో ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి.. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే.. మెగా డీఎస్సీ ఫైలు మీద మొదటి సంతకం అన్నట్టుగానే, రెండో సంతకం లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీదనే పెడతానని కూడా ప్రకటించేశారు. అయితే ఈ చట్టం గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉండడం, ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతుండడం గమనించి.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల్లో వణుకు మొదలైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదుచేశారు. దీనిపై విచారణ జరిపి తప్పుడు ప్రచారం జరుగుతూంటే దానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీ, ఏపీ సీఐడీ ని ఆదేశించింది.

ఆ విషయంలో అసలు వాస్తవాలు ఏమిటో తర్వాత నిగ్గుతేలుతాయి. కానీ ఇక్కడ మరో విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. వృద్ధులకు లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ అనేదిరెండు నెలలుగా రకరకాల మార్గాల్లో జరుగుతోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరగకుండా ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల కారణంగానే.. గత నెలలో అందరినీ సచివాలయాలకు వచ్చి తీసుకోమని చెప్పారు. 33 మంది మరణించారు. ఈ నెలలో బ్యాంకు ఖాతాల్లో వేశారు పదిమంది వరకు మరణించారు. అయితే ఈ చావులన్నీ కూడా కేవలం చంద్రబాబునాయుడు కారణంగానే జరిగినట్టుగా, ఆయనే ఈ అన్ని మరణాలకు అసలు కారకుడు అన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ ఒక విషప్రచారం కొనసాగిస్తోంది. నిజానికి ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబునాయుడుకు ముడిపెట్టి విషం చిమ్ముతున్నారు. దీనిపై తెలుగుదేశం నాయకులు కూడా పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. వాటి గురించి నామమాత్రంగా కూడా పట్టించుకోకపోగా.. వైసీపీ వారి ఆరోపణల మీద మాత్రం తక్షణం స్పందించి.. విచారణకు ఆదేశించడం చోద్యంగా ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles