నేరం చేసేసి ‘కాన్ఫిడెన్షియల్’ అంటే కుదురుతుందా?

Friday, December 5, 2025

ఇంటిలిజెన్స్ విభాగానికి జగన్ సర్కారు పాలన కాలంలో చీఫ్ గా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు ఇప్పుడు చాలా చిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఆయన చేతిలో అధికారంలో ఉన్న కాలంలో వచ్చిలవిడిగా పాల్పడిన పాపాలకు సంబంధించి ఇప్పుడు విచారణ సాగుతోంటే.. అందుకు సహకరించకుండా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఆయన చేసిన నేరాన్ని దొరకబుచ్చే ఏ ప్రశ్న అడిగినా సరే.. ‘కాన్ఫిడెన్షియల్’ అని సమాధానం చెబుతూ దాటవేస్తున్నారు. అంతకంటె గొప్ప బ్రహ్మాస్త్రం వంటి జవాబు కూడా ఆయన వద్ద ఉంటోంది. అదే ఆయన పాటిస్తున్న మౌనం!

గ్రూప్ 1 ప్రశ్నపత్రాల మూల్యాంకనం విషయంలో ఏకంగా హైకోర్టునే మోసం చేయడానికి పీఎస్సార్ ఆంజనేయులు సారథ్యం ఒక పెద్ద కుట్రరచన జరిగిన సంగతి ప్రజలకు తెలిసిందే. గ్రూప్ 1 డిజిటల్ మూల్యాంకనంలో మొత్తం మోసాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత.. కోర్టు కేసులు నమోదు అయిన తర్వాత.. హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ గా చేయించాల్సి వస్తే.. దాన్ని కాస్తా ప్రహసన ప్రాయంగా మార్చేసి.. కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తి పీఎస్సార్ ఆంజనేయులు.

ముంబాయికి చెందిన నటి కాదంబరి జెత్వానీ ని అక్రమంగా నిర్బంధించి, పోలీసులు వేధించిన కేసులో కూడా కీలక నిందితుడిగా పీఎస్సార్ పేరు ఉన్నప్పటికీ.. ఆయన తొలుత  గ్రూప్ 1 కుంభకోణంలో అరెస్టు అయ్యారు. ఆయన అరెస్టు అయిన వెంటే.. ఆయన మార్గదర్శకత్వంలో మాన్యువల్ మూల్యాంకనం అనే ప్రక్రియనే అపహాస్యం పాల్జేసేలా ఆ కాంట్రాక్టు పనిచేసిన క్యామ్ సైన్ మీడియా సంస్థ అధిపతి పమిడికాల్వ మధుసూదన్ కూడా అరెస్టు అయ్యారు. ఇద్దరి అరెస్టు తర్వాత.. వారిద్దరినీ ఏకకాలంలో పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించడానికి కోర్టు అనుమతించింది.

ఆ నేపథ్యంలో పోలీసులు పీఎస్సార్ మరియు మధుసూదన్ లకు దాదాపు 50 ప్రశ్నలకు పైగా సంధిస్తే.. వారు మాత్రం చాలా వరకు తలాతోకాలేని సమాధానాలే చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా పీఎస్సార్ ఆంజనేయులు ను అప్పటి అక్రమాల గురించి అడిగితే- వైసీపీ నాయకులకు అలవాటైన ఫక్కీలో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా వంటి సమాధానాలు వచ్చాయి. మరికొన్ని కీలక ప్రశ్నలకు ‘అదంతా కాన్ఫిడెన్షియల్’ అని ఒక్కమాటతో ఆయన ఊరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది.

ప్రభుత్వంలో ఉండగా నేరం చేసేసి, ఆ తర్వాత విచారణలో ఏం జరిగిందో చెప్పకుండా కాన్ఫిడెన్షియల్ అంటే కుదురుతుందా? నేరం చేసిన వాడికి, కనీసం పోలీసులకు దొరికిపోయినప్పుడు జరిగిందేమిటో చెప్పకుండా దాచిపెట్టుకునే హక్కు ఉంటుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అదే సమయంలో పమిడికాల్వ మధుసూదన్ మాత్రం.. తనకు పీఎస్సార్ తో పూర్వపరిచయం లేదని, ఆయన పేషీ నుంచి ఫోను వచ్చిన తర్వాతనే వచ్చి ఈ కాంట్రాక్టు తీసుకున్నానని, దీనికి తనకు ఏపీపీఎస్సీలో ముగ్గురు అధికారులు సహకరించారని.. తనకు తెలిసిన, తన ద్వారా జరిగిన అన్ని అక్రమాలను ఒప్పేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles