తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మధ్య చెప్పలేనంత అవినాభావ సంబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఆయన దత్తపుత్రుడు లాగా భావిస్తారు. జగన్ కూడా కేసీఆర్ ను పితృ సమానుడిగా గౌరవిస్తారు. కేవలం ఈ అనుబంధం మాత్రమే కాదు ఇద్దరి మధ్య చాలా పోలికలు కూడా ఉన్నాయి. అహంకారంలో ఈ ఇద్దరికీ సాటి లేదు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రతిపక్షాలను ఎంత చులకనగా అహంకారపూరితంగా చూసేవారు ప్రజలందరికీ తెలుసు. ఏ ఒక్కరికి ఆయన విలువ ఇచ్చేవారు కాదు.
అహంకారానికి నిలువెత్తు నిదర్శనంలాగానే కేసీఆర్ పదేళ్లపాటు పనిచేశారు. ఆయన దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి.. పరిపాలన సాగించింది అయిదేళ్ల పాటు మాత్రమే గానీ.. అహంకారంతో వ్యవహరించడంలో ఆయన కేసీఆర్ ను మించిపోయారు. ప్రతిపక్షాలను మాత్రమే కాదు, మీడియాను, ప్రజలను కూడా చులకనగా చూడడం జగన్ కుమాత్రమే చెల్లింది. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని నాయకుడిగా కూడా జగన్ గుర్తింపు తెచ్చుకున్నారు.
కేసీఆర్ తో కుమ్మక్కు అయి.. తాను సీఎం కాగానే కేసీఆర్ ఇంటికి విందుబోజనానికి వెళ్లి.. దాని పర్యవసానంగా హైదరాబాదు నగరంలో ఆంధ్రప్రదేశ్ కు పదేళ్లపాటు హక్కులున్న ఆస్తులన్నింటినీ వదులుకుంటూ సంతకాలు చేసి ధారాదత్తం చేసేసిన వ్యక్తి జగన్! వారి అనుబంధం అలాంటిది.
అక్కడ దత్తతండ్రి కేసీఆర్ దారుణమైన పరాభవానికి గురై ఓడిపోగా.. ఇప్పుడు ఏపీలో దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అంతకంటె దారుణమైన పరాభవంతో ఓడిపోయారు. కేసీఆర్ ప రిస్థితి చాలా బెటర్. 119 సీట్ల తెలంగాణలో ఆయన కనీసం 39 సీట్లు తెచ్చుకున్నారు. కానీ 175 సీట్ల ఏపీలో జగన్ కు దక్కింది కేవలం 10 సీట్లు మాత్రమే. ఆ రకంగా ఆత్మీయులు ఇద్దరూ ఒకే రీతి పరాజయం మూటగట్టుకున్నారు.
ఇంకో తమాషా ఏంటంటే.. కౌంటింగుకు కొన్ని రోజుల ముందువరకు కూడా కేసీఆర్ గానీ, ఆయన కొడుకు కేటీఆర్ గానీ.. జగన్మోహన్ రెడ్డి మీద అవ్యాజమైన ప్రేమానురాగాలనే చూపిస్తూ వచ్చారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ రెండోసారి ప్రభుత్వంలోకి రానున్నట్టుగా తమకు స్పష్టమైన సమాచారం ఉన్నదని చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఈ పరాభవం వారి పరువు కూడా తీస్తోంది.
కేసీఆర్ బాటలోనే దత్తపుత్రుడు : పాతాళానికి పతనం!
Wednesday, January 22, 2025