పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ దృష్టి పూర్తిగా గ్లోబల్ లెవెల్ పై పడింది. నేషనల్ మార్కెట్ లో తనకున్న క్రేజ్ కి ఇక ఇంటర్నేషనల్ రేంజ్ ని జోడించాలన్న ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నాడు. ఈ ప్లానింగ్ లో భాగంగా దర్శకుడు అట్లీతో చేస్తున్న కొత్త సినిమా మొదటి అప్‌డేట్ నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రాజెక్ట్ ను సాధారణ సినిమాగా కాకుండా, హాలీవుడ్ స్థాయిలో రూపొందించాలన్న స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు.
ఇందులో భాగంగానే హాలీవుడ్ లో అవతార్, డ్యూన్, జూరాసిక్ వరల్డ్ వంటి సినిమాలకు పని చేసిన మార్కెటింగ్ నిపుణురాలు అలెగ్జాండ్రా ఏవిస్కోనిటీని ఈ సినిమాకి తీసుకొచ్చారని వార్తలు బయటకొచ్చాయి. ఈ విషయం తెలిసి సినిమా పై హైప్ ఇంకా పెరిగిపోయింది. మేకర్స్ కూడా ఇకపై ప్రతి స్టెప్ హాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నారు.
