బావ @30, బావమరిది @50!!

Monday, September 16, 2024

తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో రెండురోజలు పండుగ వాతావరణం ఏర్పడింది. తెలుగుదేశం అగ్రనాయకులైన బావా బావమరుదులు.. తమ తమ వృత్తిగత జీవితాలలో అరుదైన మైలురాళ్లను అందుకుంటూ ఉండడమే అందుకు కారణం. బావమరిది నందమూరి బాలకృష్ణ సినీహీరోగా యాభయ్యేళ్ల కెరీర్ ను పూర్తిచేసుకున్నారు. అదే సమయంలో.. బావ నారా చంద్రబాబునాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయి 30 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఒకటిరెండు రోజుల వ్యవధిలో ఈ రెండు సందర్భాలు కలిసి రావడంతో.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. ఈ ఇద్దరు నాయకుల అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పండగ చేసుకుంటున్నారు.

నందమూరి హీరో, ఎమ్మెల్యే కూ డా అయిన బాలకృష్ణ సినీ రంగ కెరీర్ యాభయ్యేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హిందూపురంలో ఆయన అభిమానులు ప్రత్యేక ఉత్సవాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా బాలయ్యకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. బాలయ్య కెరీర్ అన్‌స్టాపబుల్ గానే సాగిపోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

కాగా, చంద్రబాబునాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి ఆదివారం నాటికి ముప్పయ్యేళ్లు పూర్తవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అతి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా సేవలందంచిన రికార్డు చంద్రబాబుదే. విభజన తర్వాత కూడా ప్రస్తుతానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినది చంద్రబాబే కావడం గమనార్హం. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత..

చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో తన దార్శనికత, ముద్ర ఏమిటో చూపించారు.
పరిపాలనలో, అభివృద్ధిలో సాంకేతికతను ఆయన మేళవించి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా కంటె.. రాష్ట్ర పరిపాలనలో సీఈఓగా పిలిపించుకోవడానికి ఆయన ముచ్చటపడ్డారు. ఇవాళ ప్రపంచ్యాప్తంగా ఐటీ రంగాలు తెలుగువారి ప్రతిభ వెలుగులీనుతున్నదంటే.. అది కేవలం చంద్రబాబునాయుడు చలవే. ఆయన ఎంతో ముందుచూపుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైటెక్ సిటీ నిర్మాణం వంటి పనులు చేపట్టడం వల్ల.. ఇవాళ హైదరాబాదు ఐటీ హబ్ గా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. హైదరాబాదును తలదన్నేలా.. ప్రపంచం మొత్తం ఇటువైపు తలతిప్పి చూసే రాజధానిగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు సంకల్పించారు. ఆ సంకల్పానికి జగన్ రూపంలో అయిదేళ్లు గ్రహణం పట్టింది. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి అయి ప్రజల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.

ఈ ఇద్దరు బావ బావమరుదులు.. తమజీవితాలలో అరుదైన మైలురాళ్లను దాటుతున్న సందర్భంలో అభిమానుల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles