Breaking: Skill Case: చంద్రబాబుకు ప్రమేయం లేదు..తేల్చిన ఈడీ!

Wednesday, October 16, 2024

చంద్రబాబు నాయుడ్ని అన్యాయంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన కేసు స్కిల్ కేసు. ఈ కేసు లో ఎన్ ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ తన దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి మొత్తంగా రూ.23 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ప్రకటించింది. ఢిల్లీ, ముంబై ,పూణేలలోని సిమెన్స్ కంపెనీ ఆస్తులను ఇప్పటికే అటాచ్ చేసింది. ఏపీ లో గత జగన్ ప్రభుత్వం హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.

నకిలీ ఇన్ వాయిస్ ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు కూడా వినిపించాయి. స్కిల్‌ కేసులో చంద్రబాబుకి ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ విషయం గురించి సీఐడీ కేసులు కూడా పెట్టింది. చంద్రబాబుకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేశారు. యాభై మూడు రోజుల తర్వాత చంద్రబాబుకి బెయిల్ మంజూరైయ్యింది.

ఆ కేసులో సీఐడీ ఒక్క రూపాయి అక్రమ లావాదేవీ చూపించలేకపోయిందని బెయిల్ ఇచ్చిన సమయంలో హైకోర్టు స్పష్టం చేసింది. ఆ కేసులోతాజాగా ఈడీ చేసిన ప్రకటన ఏపీలో మరింత కీలకంగా మారింది.

చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ…

ఈడీ తాజా విచారణ తర్వాత చంద్రబాబుకు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని నిరూపణ అయ్యింది. ఈడీ విచారణ ప్రకారం.. నిధుల డైవర్షన్ విషయంలో చంద్రబాబు ప్రమేయం లేదని తేలింది. వినాయక్ ఖాన్వెల్కర్, సుమన్ బోస్, వంటి వారు బోగస్ ఇన్వాయిస్‌లు సృష్టించి ఈ పనికి పాల్పడినట్లు  గుర్తించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఈడీ స్టేట్ మెంట్ లో చెప్పలేదు. మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు కానీ ఆయన కు సంబంధించిన వారికి డబ్బులు అందినట్లుగా ఎక్కడా చూపించలేదు. దీంతో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చేసినట్లే.

 రూపాయి కూడా ట్రాన్సాక్షన్ జరగలేదు..!

అయితే ఆ కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన సొమ్ము మళ్లీ చంద్రబాబు వద్దకు చేరిందని సీఐడీ ఆరోపించింది. చివరికి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయని కూడా వాదనలు చేసింది. అయితే అనూహ్యంగా తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్లు వెలుగులోకి వచ్చాయి. టీడీపీకి స్కిల్ కేసులో ఉన్న ఒక్క కంపెనీ కూడా విరాళాలు ఇవ్వలేదని తెలిసింది. ఇప్పుడు చంద్రబాబుపై సీఐడీ అధికారులు ఆధారాల్లేకుండా తప్పుడు కేసులు పెట్టినట్లుగా రుజువు అయ్యింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles