అలాంటి పాత్రలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటున్న బాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

Wednesday, January 22, 2025

అతిలోక సుందరి  శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తొలి చిత్రం ‘ధడక్’ తోనే ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.  ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోల సరసన నటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘ఉలఝ్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..” నా జీవితమంతా నటనకే అంకితం. తొలి సినిమా నుంచి ఇప్పటికి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. పరిశ్రమ నన్ను ఎలా చూస్తుందన్న విషయాన్ని నేను చెప్పలేను. పాటలు, డ్యాన్స్‌లు, గ్లామర్‌తో కూడిన కమర్షియల్‌ సినిమాలు చేస్తే.. అది ఇండస్ట్రీలో చాలా ఈజీ ప్రయాణం అవుతుంది.

విజయం సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలోనే ప్రజాదరణ కూడా సొంతం చేసుకోవచ్చు. కానీ, నేను రిస్క్‌తో కూడిన పాత్రలను ఎంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. అందులో నా నటన చూసి అందరూ ఆశ్చర్యపోవాలని అనుకుంటాను. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగానే చిన్న సినిమాలను ఎంచుకున్నాను.

ప్రతి సినిమాలోనూ దర్శకుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడో దాన్ని ఇవ్వడానికి వందశాతం కృషి చేస్తాను. ఇప్పటి వరకు రెండు హైరిస్క్‌ ఉన్న సినిమాలు ఎంచుకున్నాను. వాటిలో ఒకటి ‘ఉలఝ్‌’. ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను” అని తెలిపింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles