బాలీవుడ్‌ ముద్దుగుమ్మ పెళ్లి..వరుడు ఎవరంటే!

Friday, July 26, 2024

బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో ప్రస్తుతం నటి సోనాక్షి ట్రెండింగ్‌ గా మారింది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ టాపిక్‌ హాట్‌ హాట్ గా మారింది. గతంలోనూ ఆమె పెళ్లి గురించి చాలాసార్లు వార్తలు వచ్చినప్పటికీ ఈసారి మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకుంటుందనే టాక్‌ వినిపిస్తుంది.

ఆమె గ‌త‌కొంత కాలంగా న‌టుడు జ‌హీర్ ఇక్బాల్ తో ప్రేమ‌లో ఉన్నట్లు సమాచారం. అయితే, వీరికి సంబంధించిన ప‌లు ఫోటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి. కాగా, సోనాక్షి-జ‌హీర్ ల వివాహం జూన్ 23న అంగ‌రంగ వైభవంగా జరగనుందంట. ఇప్ప‌టికే వీరి పెళ్లి వేడుక‌కు సంబంధించిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయని సమాచారం.

సోనాక్షి, జ‌హీర్ ల వివాహానికి సంబంధించిన వివాహ‌ప‌త్రిక ఇప్ప‌టికే బాలీవుడ్ ప్ర‌ముఖులంద‌రికీ చేరింద‌ని.. వారంద‌రూ సోనాక్షి వివాహానికి హాజ‌రు అవుతున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజం ఉంద‌నేది మాత్రం ఎవరో ఒక‌రు క్లారిటీ ఇచ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే మరి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles