ప్రభాస్‌ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ లో బాలీవుడ్‌ భామ!

Saturday, December 7, 2024

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌,స్టార్‌ డైరెక్టర్‌ , కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌ లో వచ్చిన సినిమా సలార్‌. ఈ సినిమా మార్కెట్లో భారీ వసూళ్లను రాబట్టి ప్రభాస్‌ ఖాతాలో మరో హిట్‌ ను అందించింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్‌ అభిమానులంతా కూడా సలార్‌ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా  సీక్వెల్‌ ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్తుందని ఇప్పటికే అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది.ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుందని ఓ వార్త నెట్టింట తెగ తిరిగేస్తుంది.

ఇక క్రేజీ వార్తపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది. ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై ప్రభాస్‌, కియారా అద్వానీ జోడీ మెస్మరైజింగ్‌గా అనిపించడం ఖాయం.ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన సలార్‌ పార్టు 1లో శృతిహాసన్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించగా.. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్‌, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles