వెంకీ మామ సినిమాలో బాలీవుడ్‌ నటుడు!

Tuesday, January 21, 2025

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ లో వెంకీ మామ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలో  మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా ఈ సినిమాలో మరో అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రలో ఓ బాలీవుడ్ స్టార్ నటించనున్నట్లు ఓ టాక్ అయితే టాలీవుడ్న లో డుస్తోంది. ఆ స్టార్ ‘సల్మాన్ ఖాన్’ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. రీసెంట్ గా పొల్లాచ్చిలో ఈ సినిమా షెడ్యూల్ జరిగిన సంగతి తెలిసిందే. భాను మాస్టర్ కొరియోగ్రఫీ లో వెంకటేష్ – ఐశ్వర్య రాజేష్ ల పై ఓ పాటను చిత్రీకరించారు.

ఈ పాటలో వెంకటేష్ – ఐశ్వర్య రాజేష్ భార్య భర్తలుగా కనిపించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles