తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలసి ఉమ్మడిగా రూపొందించిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి భారతీయ జనతాపార్టీ తరఫున రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థ నాధ్ సింగ్ హాజరయ్యారు. అయితే ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో ప్రతిని తన చేతులతో పట్టుకోలేదు. దానికి తోడు- మేనిఫెస్టో మీద చంద్రబాబు, పవన్ కల్యాణ్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. అంతే.. ఆ మేనిఫెస్టో రూపం నీలిదళాలకు లడ్డూలాగా దొరికింది. కూటమిలో లుకలుకలు వచ్చాయని, బిజెపి దూరం జరుగుతున్నదని రకరకాల దుష్ప్రచారాలు ప్రారంభించారు.
అయితే బిజెపి రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాధ్ సింగ్.. బుధవారం నాడు ఇలాంటి కుట్రపూరితమైన పుకార్లకు అడ్డుకట్టవేశారు. తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి రూపొందించిన ఉమ్మడి మేనిఫెస్టోకు కేంద్రంలోని బిజెపి తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టత ఇచ్చారు. కూటమిలో లుకలుకలు వచ్చినట్టుగా ప్రచారం చేయడం సబబు కాదని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో మాత్రమే మేనిఫెస్టో ను రూపొందించిందని, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీచేస్తున్నప్పుడు ఆయా చోట్ల ఆ పార్టీలు విడుదల చేస్తున్న మేనిఫెస్టోలలో బిజెపి భాగస్వామ్యం తీసుకోవడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. బీహార్లో నితీశ్ కుమార్ విషయంలో గానీ, కర్ణాటకలో జేడీఎస్ విషయంలో గానీ అలాగే జరిగిందని ఆయన ఉదాహరణలు కూడా చెప్పారు. తెలుగుదేశం- జనసేన మేనిఫెస్టోలో కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను వంటి కొన్ని హామీలను భాజపా సూచన మేరకే పొందుపరిచినట్లు కూడా చెప్పారు.
సాక్షాత్తూ ఆ పార్టీ ఇన్చార్జి స్పష్టత ఇవ్వడంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా దళాలు రెండు రోజులుగా చేస్తున్న వికృతప్రచారానికి తెరపడినట్లయింది. నిజానికి ఈ కుట్ర ప్రచారాలను అధినేత జగన్మోహన్ రెడ్డే ప్రారంభించారు. చంద్రబాబు ఇలా మేనిఫెస్టో విడుదల చేశారో లేదో.. అదేరోజున తన ప్రచార సభల్లో.. మేనిఫెస్టో మీద తన ఫోటో వేయవద్దంటూ మోడీ కార్యాలయం నుంచి గట్టిగా ఆదేశించినట్టు తనకు సమాచారం ఉన్నదని జగన్ అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడం ప్రారంభించారు. వైసీపీ సోషల్ మీడియా సమస్తంగా ఆ ప్రచారాన్ని అందిపుచ్చుకుంది.
దీంతో సిద్ధార్థనాధ్ సింగ్ తెరపైకి వచ్చి.. కూటమి ఐక్యంగా ఉన్నదని, బిజెపి జాతీయ మేనిఫెస్టో వేరే ఉంటుందని.. అందువల్ల ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలో తాము ఇన్వాల్వ్ కాలేదని అన్నారు. కూటమి అభ్యర్థులు మెజారిటీ సీట్లు గెలుస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు.
నీలి దళాలు.. నీచ ప్రచారాలు కట్టిపెట్టాలి!
Thursday, November 21, 2024