ప్రవీణ్ ప్రకాష్ ఓవరాక్షన్ కు అడ్డుకట్ట!

Thursday, November 21, 2024

తల్లిదండ్రుల సమావేశాల పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని చూసిన కుటిల యత్నానికి తెరపడింది. పాఠశాలలకు చివరి పనిరోజు అయిన ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారడంతో ప్రవీణ్ ప్రకాష్ ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. ఈనెల 23వ తేదీ బదులు, జూన్ 12వ తేదీన తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందు కోడ్ అమలులో ఉన్న సమయంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం ద్వారా తల్లిదండ్రులు అందరినీ లోబరుచుకునే ప్రయత్నాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. 

జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు కూడా తొలినించి “మేము ప్రతి ఇంటికి ఇంత సొమ్ములు ఇచ్చాము కాబట్టి మీరు మాకు రుణపడి ఉండాలి..  మీరందరూ మాకు ఓటు వేసి తీరాలి” అని బ్లాక్ మెయిల్ చేసే ఫార్ములానే అనుసరిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్లు తీసుకునే అన్ని వర్గాల వారిని వాలంటీర్ల ద్వారా ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి వ్యూహరచన చేస్తే, అదికాస్తా ఈసీ  ఆదేశాలతో విఫలమైంది. తాజాగా అమ్మ ఒడి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే సొమ్ము తీసుకునే లబ్ధిదారులందరికీ ఎన్నికలకు ముందు తన లక్ష్యాన్ని వివరించడానికి చేసే ప్రయత్నంగా ఈ సమావేశాలను ప్రవీణ్ ప్రకాష్ ఏర్పాటు చేశారు.

ఎన్నికలకు ముందు ఇలాంటి సమావేశం.. అంటే  కేవలం వారిని జగన్మోహన్ రెడ్డి కి అనుకూలంగా మార్చడానికి, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసే దానికి మాత్రమే ఉద్దేశించినది అని పలు విమర్శలు వచ్చాయి. కేవలం విమర్శలు అయితే వారు పట్టించుకునే వారు కాదేమో గాని..  ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు కూడా వెళ్లడంతో వెనక్కు తగ్గారు. ఇప్పటికే పలు అంశాల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న దుడుకు నిర్ణయాలను ఎన్నికల సంఘం  సంఘం అక్షేపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 

“మేము ఇచ్చే డబ్బు మీరు తీసుకుంటున్నారు కనుక.. మమ్మల్ని గెలిపించకపోతే మీరు నాశనం అయిపోతారు..* అనే శాపనార్ధాలు పెట్టడం ఒక్కటే తక్కువ. ఇతరత్రా మాటలతో ఇంతకుమించి రాష్ట్రంలోని అన్ని పథకాల లబ్ధిదారులను బ్లాక్ మెయిల్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నది. ఆ క్రమంలో భాగంగానే తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆటోమేటిగ్గా అమ్మ ఒడి కింద డబ్బు పొందే వారందరూ అక్కడికి వస్తారు కాబట్టి.. వారిని ప్రభావితం చేయవచ్చునని ఆశపడింది. అయితే అనూహ్యంగా  వివాదం రేగడంతో ప్రవీణ్ ప్రకాష్ తన ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles