కింగ్‌ 100 వ సినిమాకి పెద్ద ప్లానింగే!

Friday, December 5, 2025

టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం సినిమా ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పటివరకు తనకున్న స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టే రోల్స్‌ను ఎంచుకుంటూ వెళ్తున్న నాగ్, ప్రస్తుతం ‘కుబేర’ మరియు ‘కూలీ’ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు చిత్రాల తర్వాత నాగార్జున తన కెరీర్‌లో ఓ స్పెషల్ మైలురాయిగా నిలిచే సినిమాను స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్. ఇది ఆయన కెరీర్‌లో 100వ చిత్రం కావడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మొదట ఈ ప్రాజెక్ట్‌ను తమిళ దర్శకుడు నవీన్ డైరెక్ట్ చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, ఇప్పుడు కార్తీక్ అనే మరో తమిళ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇక ఈ స్పెషల్ మూవీకీ సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్‌ను నాగార్జున తన బర్త్‌డే రోజైన ఆగస్ట్ 29న అనౌన్స్ చేసే అవకాశం ఉందంటూ ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వార్తలతో నాగ్ ఫ్యాన్స్‌లో ఇప్పటికే హైప్ పెరిగిపోయింది. అందరూ నాగార్జున శత చిత్ర ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles