జగన్ కు భలే సలహా చెప్పిన భూమిరెడ్డి!

Wednesday, January 22, 2025

జగన్మోహన్ రెడ్డి కుటుంబం చరిత్ర  పుట్టుపూర్వోత్తరాలు మాత్రమే కాదు కదా.. వారందరి పుట్టుమచ్చలు సహా చెప్పగలిగిన కొందరు నాయకుల్లో కడప జిల్లాకే చెందిన తెలుగుదేశం నాయకుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా ఒకరు. వైఎస్ జగన్ కుటుంబం యొక్క చరిత్ర వైఎస్ రాజారెడ్డి అనే పేరు దగ్గరినుంచి మాత్రమే ప్రపంచానికి తెలుసు. రాజారెడ్డి కంటె ముందు కొన్ని తరాలుగా ఆ కుటుంబం చరిత్ర మొత్తం ఆయన చెప్పగలరు. అదంతా పక్కన పెడితే.. జగన్ గురించి అంత అవగాహన ఉన్న భూమిరెడ్డి ప్రస్తుతం ఆయనకు ఒక మంచి సలహా చెబుతున్నారు. అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం లేనప్పుడు.. పులివెందుల ప్రజలు ఇచ్చిన బాధ్యతను పట్టించుకునే ఆలోచన లేనప్పుడు.. ఎంచక్కా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తే.. పులివెందుల ప్రజల కష్టాలను అసెంబ్లీలో వినిపించడానికి ఎవరో ఒకరు బాధ్యతలగల వ్యక్తి కొత్త ఎమ్మెల్యేగా వస్తారని ఆన సలహా ఇస్తున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు గనుక.. అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం లేదని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పిన నేపథ్యంలో భూమిరెడ్డి సలహా ఆసక్తికరంగా ఉంది.

జగన్మోహన్ రెడ్డి తాను కేవలం పులివెందుల ప్రజలకు ఎమ్మెల్యేని మాత్రమే అనే సంగతిని మర్చిపోతున్నారు. తనను తాను ఇంకా తెలుగుజాతికి నాయకుడిగా ఊహించుకుంటున్నారు. అలాంటి భ్రమల్లోంచి, ఇల్యూజన్స్ లోంచి అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఎమ్మెల్యేగా శాసనసభకు వెళ్లడం.. పులివెందుల ప్రజల కష్టాల గురించి మాట్లాడడం ఆయన విధి. ఆయనేమో రాష్ట్ర ప్రజలందరి గురించి మాట్లాడతా అంటున్నారు. సరే పోన్లెద్దూ ఏదో ఒకసారి ముఖ్యమంత్రిగా చేశాడు కదా.. రాష్ట్రమంతా తెలిసి ఉంటారు అనుకున్నా కూడా.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మాత్రమే మాట్లాడతా అంటున్నారు. ఇంతకూ ఆయన హోదాకోసం మాట్లాడుతున్నారా? ప్రజలకోసం మాట్లాడుతున్నారా? అనేది సందిగ్ధమే.
అందుకే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సలహా ఇస్తున్నారు. ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేసేస్తే కొత్త ఎమ్మెల్యే వస్తారుకదా అంటున్నారు. శాసనసభకు రాకపోవడం సిగ్గుచేటు అంటున్నారు.

అయినా జగన్ కోరుకునే బ్యాలెట్ పద్ధతిలోనే జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీని పోటీకి దించకూడదని జగన్ నిర్ణయించుకోవడానికి భూమిరెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు చేయడం జగన్ కు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదని, ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన మార్క్ అక్రమాలు సాధ్యం కావనే భయంతోనే పోటీకి దూరంగా ఉంటున్నారని భూమిరెడ్డి అంటున్నారు.

ReplyForwardAdd reaction

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles