మెగాస్టార్ చేతుల మీదుగా “భజే వాయు వేగం” టీజర్

Saturday, December 7, 2024

యంగ్‌ హీరోల్లో అటు హీరోగానూ..ఇటు విలన్ గానూ మెప్పించిన అతి కొద్ది మంది యంగ్‌ హీరోల్లో కార్తీకేయకూడా ఒకరు. కథానాయకుడిగా ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం భజే వాయు వేగం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ని మూవీ మేకర్స్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయించారు.

ఈ సినిమా టీజర్ మంచి ఎమోషన్స్ తో పాటు రెసీగా కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. కన్న తండ్రి కోసం ఎంత దూరమైనా వెళ్లే ఓ యువకుడిగా కార్తికేయ కనిపిస్తున్నాడు. యాక్షన్‌ పార్ట్ లో సాలిడ్‌ లుక్స్ తో కార్తీకేయ అదరగొట్టాడు. తనికెళ్ల భరణి పై ఎమోషనల్‌ ఎపిసోడ్‌ కూడా వర్క్ అయ్యేలా కనిపిస్తుంది.

ఈ మూవీ టీజర్ లో రాహుల్‌ టైసన్ కూడా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా సినిమాలో  యాక్షన్ సీన్స్ టీజర్ లో చాలా యావరేజ్ గా ఉంది. ఆల్రెడీ విన్నట్టుగానే సలార్ స్కోర్ లైన్ కూడా గుర్తుకు వస్తుంది. ఇది ఫుల్ మూవీలో కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని టాక్.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles