టాలీవుడ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన తాజా సినిమా కిష్కంధపురి ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హారర్ జానర్‌లో తెరకెక్కి భయాన్ని కలిగించేలా సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తయ్యి, ప్రమోషన్స్‌లో జోరుగా కొనసాగుతోంది.
ఇక సెన్సార్ విషయానికి వస్తే, ఈ సినిమాకు బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే సాధారణంగా ఇలాంటి రేటింగ్ వచ్చే సినిమాల్లో మద్యం, పొగ త్రాగడం వంటి సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో అలాంటి సీన్లు ఒక్కటి కూడా లేవని సినిమా బృందం చెబుతోంది. ఏ విధమైన ఆరోగ్య వార్నింగ్ యాడ్స్ లేకపోయినా, కేవలం భయం పుట్టించే సన్నివేశాల వల్లే ఈ సర్టిఫికెట్ ఇచ్చారన్నది వారి వివరణ.
భయానక సన్నివేశాలు చిన్న పిల్లలకు సైకాలజికల్‌గా ప్రభావం చూపవచ్చనే కారణంతో పెద్దలకే పరిమితమైందని యూనిట్ స్పష్టం చేసింది.
