ఒకే సారి మూడు సినిమాలను లాక్‌ చేసిన బెల్లంకొండ!

Wednesday, January 22, 2025

టాలీవుడ్ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ తన మొదటి మూవీతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు.. ఆ తరువాత వచ్చిన జయ జానకి నాయక సినిమాతో మంచి హిట్ అందుకుని దూసుకుపోతున్నాడు. అయితే బెల్లంకొండ డెబ్యూ ఇచ్చి ఈరోజుతో పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. పది సంవత్సరాలు తరువాత వరుస సినిమాలతో బెల్లంకొండ ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

 బెల్లంకొండకి సినిమాలకి తెలుగులో కంటే హిందీలో భారీ క్రేజ్‌ ఉంది. జయ జానకి నాయక సినిమాని ఇప్పటికీ హిందీలో చూసేవారు ఉన్నారు. అలాగే ఛత్రపతితో హిందీలో అడుగు పెట్టాడు కానీ పెద్దగా సక్సెస్‌ కాలేకపోయాడనే చెప్పుకొవచ్చు. ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై వస్తున్న ‘టైసన్ నాయుడు’ షూటింగ్‌లో బెల్లంకొండ  ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పూర్తవనుంది.  దీంతోపాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌తో, మూన్‌షైన్ పిక్చర్స్‌తో కూడా ఒప్పందం చేసుకున్నాడు. ఈ సినిమాల కోసం ఇంతకు ముందు ఎప్పుడూ చూడని లుక్‌లో శ్రీనివాస్‌ కనిపించనున్నాడు అని సమాచారం. ఇవీ అన్నీ కూడా చాలా ప్రత్యకమైన కథలు అని, ఇవి అతని కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్‌ చేస్తాయి అని సన్నిహితులు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles