బాలయ్య బాబు..చిరు కాంబో!

Friday, December 20, 2024

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజులగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరితో మల్టీ స్టారర్ సినిమా చేయాలని చాలా మంది దర్శకులు అనుకున్నప్పటికీ అనేక కారణాల వల్ల అది కుదరలేదు. కొన్ని సందర్భాల్లో విడుదలైన సినిమాలను చూస్తుంటే ఫలానా హీరోలను వాడుకుంటే బాగుండేదని ప్రేక్షకులు  కూడా అనుకున్నారు.

సినిమా తీయడానికి ముందు రచయితలు, దర్శకులు కథలో ఎవరు బాగుంటారన్నది ఆలోచించి ఆ హీరోల దగ్గరకు వెళ్తారు కానీ కథలు నచ్చక కాల్షీట్‌లు దొరకడం లేదు. చిరంజీవి శివుడిగా నటించిన చిత్రం శ్రీ మంజునాథ. ఇందులో అర్జున్ ప్రధాన పాత్ర లో నటించాడు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాలో శివ పాత్రలో బాలకృష్ణ అయితే బాగుంటుందని దర్శకుడు కె.రాఘవేంద్రరావు భావించారు. వీరిద్దరూ కమర్షియల్ చిత్రాల్లో నటించలేకపోయారు కాబట్టి.. పౌరాణిక సినిమాలో యాక్ట్‌ చేయించాలని చేస్తున్నాడు.

అయితే కథలో అర్జున్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదని భావించి బాలకృష్ణ ఈ పాత్రలో నటించేందుకు రెడీగా లేడు. దీంతో అర్జున్, సౌందర్య ప్రధాన నటులుగా, చిరంజీవి శివుడిగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ వారి కాంబో గురించి ఎన్నో వార్తలు వచ్చినా అవి పట్టాలెక్కలేదు. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నెన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చి ఉండొచ్చు కానీ ఒక ఎవర్ గ్రీన్ మల్టీస్టారర్ కాంబో ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ ల కలయికే అని చెప్పుకోవాలి.

వీరిద్దరి బాక్సాఫీస్ యుద్ధం అభిమానులకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల బాలయ్య బాబు స్వర్ణోత్సవాల్లో చిరు తమ ఇద్దరినీ పెట్టి సినిమా చేయాలని బోయపాటి శ్రీనుకి సవాలు విసిరారు బాలయ్య బాబు. అయితే లేటెస్ట్ గా వీరి కాంబో పై బోయపాటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ అవార్డు ఈవెంట్ కి హాజనైన బోయపాటి ఎదురుగా చిరు బాలయ్యలని పెట్టుకుని వారికి కథ రాయకపోతే అనవసరం… వారిద్దరే తన సినిమాకి టైటిల్ అంటూ క్రేజీగా కామెంట్లు చేశారు. దీంతో ఎవరూ ఊహించని మాస్ కలయికపై ఓ రేంజ్ హైప్ మళ్లీ వచ్చేసింది. మరి ఇదంతా చూస్తుంటే ఫ్యూచర్ లో ఈ సెన్సేషనల్ కాంబో పడే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles