ఫుల్‌ వీడియోతో వచ్చేసిన బైరవ ఆంథమ్‌…పంజాబీ స్టైల్లో అదరగొట్టేశారు అంతే!

Saturday, July 20, 2024

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న తొలి సైన్స్‌ ఫిక్షన్‌ కథ కల్కి 2898 ఏడీ మరో పది రోజుల్లో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ విడుదల చూస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ పోస్టర్ తో ప్రకటించారు.‘ఇండియా బిగ్గెస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది వేచి ఉండండి అంటూ కల్కి టీమ్ సాంగ్ పై ఒక్కసారిగా హైప్ పెంచేశారు.

ఇక చెప్పినట్లుగానే సోమవారం ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ భైర‌వ ఆంథమ్ ఫుల్ వీడియోను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఇక ఈ పాటను ప్ర‌ముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసంజ్ ఆలపించాడు. సంతోశ్ నారాయణ్ సంగీతం అందించాడు. ‘భైరవ ఆంథమ్’ పేరుతో విడుదలైన ఈ పాట  తెలుగు విత్ పంజాబీ లిరిక్స్ తో మిక్స్ అయి ఉంది. ఇక సాంగ్ లో ప్రభాస్ లుక్స్ చాలా స్టైలిష్ గా కనపడ్డాయి.

ముఖ్యంగా పాట చివర్లో ప్రభాస్ పంజాబీ లుక్ లో అదిరిపోయాడు. ఆ లుక్ లో పంచె ఎత్తి అలా స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ డార్లింగ్స్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ‘భైరవ ఆంథమ్’ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles