వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలం లో విద్యుత్ ఛార్జీలను విచ్చలవిడిగా పెంచడంతో ప్రజలు విలవిలాడిపోయారు. ఎప్పుడు పడితే అప్పుడు ట్రూ అప్ చార్జీల పేరిట పెంచుతూ ప్రజల మీద గుదిబండలా మోపింది జగన్ సర్కార్. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలోనే విద్యుత్ చార్జీల విషయంలో ప్రజలకు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు తమ ప్రభుత్వం ఉండగల ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గించడానికి ప్రయత్నిస్తామని చంద్రబాబు చెప్పారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం అనే ఆయన మాటను అప్పట్లో జగన్ మరియు ఆయన అనుచరగణాలు ఎద్దేవా చేశారు కూడా. కానీ ఆ మాటలనే సాకారం చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు విద్యుత్ చార్జీలు కొంతమేర తగ్గనున్నాయి. ఏ రకంగా అయితే ట్రూ అప్ పేరిట ఎప్పుడు పడితే అప్పుడు వడ్డిస్తూ వచ్చారో.. అదే తరహాలో ట్రూ డౌన్ పేరిట ఇప్పుడు చార్జీలు తగ్గించే కసరత్తు జరుగుతుంది.
సాధారణంగా రెగ్యులేటరీ కమిషన్ ఏపీఈఆర్‌సి అనుమతించిన మొత్తం కంటే.. వాస్తవంగా అయిన ఖర్చు అదనంగా ఉన్నట్లయితే దానిని లెక్కించి ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ సంస్థలు ప్రజల నుంచి వసూలు చేస్తాయి. సరిగ్గా దీనికి వ్యతిరేకంగా జరిగేదే ట్రూ డౌన్ చార్జీల వ్యవహారం. అంటే రెగ్యులేటరీ కమిషన్ అనుమతించిన మొత్తం కంటే వాస్తవ ఖర్చు తక్కువగా ఉన్నప్పుడు ఆ మిగులు మొత్తాన్ని కూడా వినియోగదారులకే సర్దుబాటు చేస్తారు. ఆ మేరకు వినియోగదారులు చెల్లించవలసిన మొత్తం ఏదో ఒక విధంగా తగ్గిస్తారు.
జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు మోయలేని భారంగా పెరుగుతూ పోవడాన్ని చవిచూసిన రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు చార్జీలు ఒక్క రూపాయి తగ్గినా సరే అది ఎంతో శుభవార్తగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకున్నారని, ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో అదే విధంగా విద్యుత్ ఛార్జీలను ఈ ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చేస్తున్నదని ప్రజలు హర్షిస్తున్నారు.
బాబు సర్కార్.. విద్యుత్తు చార్జీలు తగ్గనున్నాయ్!
Friday, December 5, 2025
