పింఛనుదార్లకు బాబు మహాద్భుతమైన వరాలు!

Tuesday, January 21, 2025

రాష్ట్రంలోని పింఛనుదార్లందరూ కూడా ఎగబడి సైకిలు గుర్తుకు ఓటు వేసేలా.. చంద్రబాబునాయుడు మహాద్భుతమైన వరాలను ప్రకటించారు. ప్రత్యర్థి పార్టీ జడుసుకునే స్థాయిలో పింఛనుదార్లను ఉద్దేశించి చంద్రబాబు ప్రకటించిన వరాలు ఉన్నాయి. ఇళ్ల వద్ద పింఛన్లు అందజేయడానికి చంద్రబాబునాయుడు అడ్డు పడుతున్నాడని, వృద్ధులను రోడ్ల మీదకు రప్పించి.. వారి చావులకు కారణం అవుతున్నారని.. వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు విషప్రచారానికి పూనుకుంటున్న సమయంలో.. చంద్రబాబు.. ఆ ప్రచారానికి కూడా సరైన విరుగుడుగా పింఛనుదార్లకు భరోసా అందిస్తున్నారు. ప్రెస్ మీట్ నిర్వహించిన చంద్రబాబు.. పింఛనుదార్లంతా తెలుగుదేశాన్ని నెత్తిన పెట్టుకునేలా వరాలను గుప్పించడం గమనార్హం.

ఆయన మాటల్లో మొదట కీలకంగా పరిగణించాల్సినది… ఒకటోతేదీనే ఇళ్ల వద్దకే పింఛను అందజేస్తాం అనే మాట. ఆ విషయంలో బాబు మీద చెడు ప్రచారం జరుగుతుండగా.. ఆ మాట చాలా కీలకమైనది. అలాగే తమ ప్రభుత్వం రాగానే.. అందరికీ పింఛనును నాలుగువేల రూపాయలకు పెంచుతానని కూడా చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు పింఛను పెంచుతానన్న హామీకే ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలకిందులు అవుతోంది. ఇప్పటికిప్పుడు తాము కూడా పింఛను పెంచుతాం అని ప్రకటించలేరు. చంద్రబాబును కాపీ కొట్టినట్టుగా ఉంటుంది. అలాగని తక్షణం దాన్ని అమల్లోకి కూడా తేలేరు. ప్రభుత్వం వద్ద నిధులు లేవు. ఆ భారాన్ని భరించలేరు. పైగా చంద్రబాబు హామీచూసి జడుసుకన్నట్టుగా ప్రజలు కనిపెట్టేస్తారు.. అనే భయంలో జగన్ కోటరీ కిందామీదా అవుతోంది. ఈలోగానే చంద్రబాబు వారిమీద పిడుగులాంటి మరో కబురు కూడా ప్రకటించేశారు.

పింఛన్లను రూ. 4 వేలకు కేవలం పెంచడం మాత్రమే కాదు.. ఆ పెంచిన పింఛనును ఏప్రిల్ నెలనుంచే ఇవ్వబోతున్నట్లుగా చంద్రబాబు పేర్కొనడం విశేషం. తమ పార్టీ అధికారంలోకి వస్తే గనుక.. జులై నెలలో ఇళ్లవద్దనే ఇచ్చే పింఛన్లలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ.4వేలకు పెంచినట్లుగా పరిగణించి.. వారికి అప్పటికే అందినది పోగా.. మిగిలిన మొత్తాన్ని కూడా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అంటే జులై నెలలో పింఛను దార్లకు ఆ నెల పింఛను రూ.4వేలతో పాటు అదనంగా మరో 3వేలు కూడా అందుతాయన్నమాట. ఈ చంద్రబాబు ప్రకటన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అశనిపాతం అనే చెప్పాలి. మరి ఈ చంద్రబాబు దెబ్బనుంచి తేరుకోవడానికి జగన్ దళానికి ఎన్నాళ్లు పడుతుందో ఏమో?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles