అవినాష్ రెడ్డి.. కుట్రలు తెలిస్తే షాక్ అవుతారంతే!

Wednesday, March 26, 2025

వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం కడప ఎంపీ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రీతిపాత్రుడైన తమ్ముడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సూత్రధారిగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు. వివేకా హత్యతో తనకు అసలు సంబంధమే లేదని.. ఆస్తులు చేజారిపోకుండా చూసుకునేందుకు ఆయన కూతురు సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి కలిసి చంపించారని ఆరోపిస్తూ రోజులు నెట్టుకొస్తున్నారు.

అలాంటిది మంగళవారం సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ అవినాష్ రెడ్డి.. వివేకా హత్యకేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో అనేక విషయాలను వెల్లడించింది. ఒక హత్య కేసు సీరియస్ గా విచారణ సాగుతుండగా.. ఆ దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి ఆయన ఎన్ని కుట్రలు చేశారో, ఎవరెవరి సహకారంతో, ఎవరెవరిని బెదిరించి ఆ కుట్రలను అమలు చేశారో సవివరంగా ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ కుట్రలు జరిగిన తీరు గమనిస్తే ఎవరైనా షాక్ కు గురి కావాల్సిందే. ఆ అపిడవిట్ ప్రకారం.. అవినాష్ చేసిన కుట్రలు ఇలా ఉన్నాయి.

హత్యకు సూత్రధారిగా ప్రధానంగా అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉండగా.. ఆయన మాత్రం కన్న కూతురే భర్తతో కలిసి తండ్రి వివేకాను హత్య చేయించినట్టుగా ప్రచారం చేస్తూ వచ్చారు. హత్యకు అవసరమైన మోటివ్ తనకు లేదని, అదే సమయంలో కూతురుకు ఆస్తులు దక్కించుకోవాలనే మోటివ్ ఉందని కూడా ప్రచారం చేశారు.

కొన్నాళ్ల తరువాత.. వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. సునీత, రాజశేఖర రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ కలిసి తనను బెదిరిస్తున్నారని, వారినుంచి తనకు ప్రాణాపాయం ఉన్నదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్పీ రాంసింగ్ ఎలా చెబితే అలా సాక్ష్యం చెప్పాలంటూ సునీత తనను బెదిరించినట్టుగా ఆయన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నేరుగా కోర్టులో పిటిషన్ వేసి.. ఆ తర్వాత.. ఆ కేసును పోలీసులు రిజిస్టర్ చేసుకునేలా వ్యవహరించారు.

అయితే ఏపీ సర్కారు అఫిడవిట్ ప్రకారం ఈ ఫిర్యాదు మొత్తం అవినాష్ రెడ్డి స్కెచ్ ప్రకారమే జరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే.. ఎస్పీ రాంసింగ్ అసలు పీఏ కృష్ణారెడ్డిని ఎన్నడూ విచారణఖు పిలవనే లేదని, ఆయన చెబుతున్న తేదీల్లో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించినా కృష్ణారెడ్డి స్టేషనుకు విచారణ నిమిత్తం వచ్చినట్టుగా రుజువుల్లేవని ప్రభుత్వం చెబుతోంది.

ఈ కేసుకు సంబంధించి పలువురు సాక్షులను కూడా విచారించినట్టుగా నమోదు చేశారు. అయితే ఇదంతా అప్పటి విచారణాధికారి జి.రాజు ను కూడా బెదిరించి లొంగదీసుకోవడం ద్వారా జరిగిందని ఈ అఫిడవిట్ చెబుతోంది. ఆ సాక్షులందరినీ కొత్తగా విచారిస్తే.. అసలు తాము ఎవ్వరూ ఎవ్వరికీ ఏ వాంగ్మూలమూ ఇవ్వనేలేదని వారు చెప్పినట్టుగా తెలుస్తోంది.

అఫిడవిట్ ప్రకారం ఏం జరిగిందంటే.. అవినాష్ రెడ్డి ఇద్దరు పోలీసు అధికారుల ద్వారా తన పని నడిపించారు. ఒకరు రిటైర్డు ఎఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి, మరొకరు ఎఎస్ఐజి రామకృష్ణారెడ్డి! వీరిద్దరూ అసలు ఏ సాక్షులతోనూ మాట్లాడకుండానే ఇంట్లో కూర్చుని దొంగ వాంగ్మూలాలను తయారుచేశారు. చార్జిషీటు దాఖలు కూడా వీరి మార్గదర్శకత్వంలోనే జరిగింది. రామకృష్ణారెడ్డి ఇంట్లోనే ఈ వ్యవహారం అంతా నడిపించారు.

ఈ కేసు డైరీ పత్రాలపై సంతకం చేయడానికి విచారణాధికారి జి.రాజు నిరాకరించినప్పుడు.. అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్లారు. ఆయన- చెప్పినట్టు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు. అయితే అన్నీ అబద్ధాలతోనే ఈ కేసును నడిపించినట్టుగా ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది.
మరొకవైపు కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో కూడా వివేకా హత్య కేసు అసలు నిందితుల్ని వెలుగులోకి తెస్తాం అని చంద్రబాబు ప్రకటించారు. విచారణను తప్పుదారి పట్టించడంలో ఈ కేసు ఒక కేస్ స్టడీ లాంటిదని ఆయన పేర్కొనడం గమనార్హం.

ఇంతకూ అవినాష్ రెడ్డి కుట్ర స్కెచ్ లు దిమ్మతిరిగేలాగానే ఉన్నాయి గానీ.. ఆయన వీటిలో పూర్తిగా ఇరుక్కుంటారని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles