అనకాపల్లిలో భారతీయ జనతా పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న సీఎం రమేశ్ పై దాడి జరిగింది. వైస్సార్ కాంగ్రెస్ గూండాలూ ఆయన మీదకు ఒక్కసారిగా ఎగబడి దాడిచేశారు. ఈ దాడిలో ఆయన చొక్కా చిరిగిపోయింది. గాయాలయ్యాయి. ఆయనకారుతో పాటు, రమేశ్ కాన్వాయ్ లోని ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా..? సీఎం రమేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దేవరాపల్లి పోలీసు స్టేషన్ కు తరలిస్తుండగానే జరిగింది. వైకాపా శ్రేణులు ఒక్కసారిగా పోలీసు వాహనం మీదికే ఎగబడ్డారు. సీఎం రమేశ్ ను కొడుతోంటే పోలీసులు ప్రేక్షకులే అయిపోయారు. ఈ ఘటన పోలీసు వ్యవస్థకే అవమానం అని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఇంతకూ ఏం జరిగిందంటే..
అనకాపల్లి నియోజకవర్గంలోని మాడుగుల మండలం తారువ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా భాజపా, కూటమి కార్యకర్తలపై మొదటి దాడి జరిగింది. అక్కడి బిజెపి కార్యకర్త ఇంటివద్ద ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు.. వైసీపీ వారు దాడిచేసి.. వారి డ్రోన్ ను ఇతర వాటిని ధ్వంసం చేశారు. నలుగురు గాయపడ్డారు. ఈలోగా అక్కడకు చ్చిన వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు,భాజపా కార్యకర్త గంగాధర్ ను చెప్పుతో కొట్టారు. బాధితులు దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారినే స్టేషనుకు తరలించారు. ఈలోగా సీఎం రమేష్ అక్కడకు చేరుకున్నారు.
విషయం తెలిసి స్టేషనుకు వచ్చిన సీఎం రమేశ్ – బూడి ముత్యాల నాయుడిపై హత్యాయత్నం కేసు నమోదుచేయాలంటూ కొద్దిసేపు బైఠాయించారు. తర్వాత దాడికి గురైన గంగాధర్ ను పరామర్శించేందుకు తారువ గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అదే గ్రామంలో అదే సమయంలో బూడి ముత్యాల నాయుడు కూడా ఉన్నారంటూ అనుమతించలేదు. అయితే కార్యకర్తలను పరామర్శించే వరకు కదిలేది లేదని రమేశ్ పట్టుపట్టడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషనుకు తరలించారు. అలా తరలిస్తుండగా.. పోలీసు వాహనం మీదకి వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి.
ఓటమి గురించి భయం, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ హింసకు దిగుతున్నారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటమి భయంతో ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వాస్తు మార్పులు చేయించుకుంటూ ఉండగా.. మరోవైపు ఆ పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతూ చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీఎం రమేశ్‌పై దాడి.. షేమ్ ఆన్ పోలీస్!
Wednesday, January 22, 2025