ఆ సమయంలో చరణ్ ఇంట్లో ఉన్నా: మంచు లక్ష్మి!

Wednesday, January 22, 2025

ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌ బాబు వారసులంతా కూడా సినీ రంగంలోనే ఉన్నారు. అయితే వీరిలో కుమారుల కంటే కూడా కుమార్తె మంచు లక్ష్మికి ఎక్కువ పేరు వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. ఆమె తన సొంత టాలెంట్‌తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఆమె కేవలం నటిగానే గానే కాకుండా యాంకర్ గా, నిర్మాతగా కూడా తనదైన స్టైల్‌ లో రాణించింది.

టాలీవుడ్ కి సంబందించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్న స్టార్ సెలెబ్రిటీస్ తో ఈమెకు మంచి బాండింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి ఓ షాకింగ్ విషయాన్ని బయటకు వెల్లడించింది. అప్పట్లో ముంబైలో తాను రామ్ చరణ్ ఇంట్లో రహస్యంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో వివరించింది.

నేను ముంబైకి  షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ఉండటానికి నాకు అపార్ట్‌మెంట్ లేదు. దీంతో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. ఒకవేళ చెబితే మీరు చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా.. మీకు పనిచేయాల్సిన అవసరం ఏంటని అడుగుతారు. అందుకే నేను ఇక్కడ ఉంటున్నట్లు ఎవరికీ చెప్పొద్దని చరణ్‌కి కూడా చెప్పాను. దీంతో నేను ఎందుకు చెబుతా అని అన్నాడు. కానీ నా నోరు ఆగదు కదా! ఇప్పుడు నేనే ఇప్పుడు చెప్పేశా.

కానీ అంత అందమైన ఇంట్లో ఉండటానికి నాకు మనసు రాలేదు. దీంతో వెళ్లిపోతానని చరణ్‌ తో చెప్పాను. అయితే నీకు నచ్చినన్నీ రోజులు నా ఇంట్లో ఉండు అని అన్నాడు. అలా ఎన్ని రోజులు ఉన్నానో కూడా చరణ్‌కి  కూడా తెలీదు’ అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles