హైకోర్టు సాక్షిగా ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన కుదుపుగా చర్చ్లల్లో నలుగుతున్న అంశం.. చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంటు అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపబడడం. గాజు గ్లాసు అనేది జనసేన పార్టీ యొక్క గుర్తు. జనసేన అభ్యర్థులు పోటీచేస్తున్న అన్నిచోట్ల వారికి అదే గుర్తు ఇచ్చారు. కానీ.. ఆ పార్టీ పోటీలో లేని చోట దానిని ఫ్రీ సింబల్ గా ఉంచడంద్వారా ఎన్నికల సంఘం ఒక పొరబాటు చేస్తే.. ఆర్వోలు ఆ గుర్తును స్వతంత్రులకు ఇవ్వడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి మేలు చేశారనే అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది.
గ్లాసు ఫ్రీ సింబల్ కావడం వలన స్వతంత్రులకు అది దక్కింది. తెలుగుదేశం, బిజెపి పోటీచేస్తున్న సీట్లలో మాత్రమే ఇలా జరిగింది. అంటే.. ఆయా నియోజకవర్గాల్లో కూటమికి పడే ఓట్లు చాలా వరకు గాజు గ్లాసు గుర్తుకు పడిపోయే అవకాశం ఉంది. అయితే ఇదంతా చాలా నియోజకవర్గాల్లో ఆర్వోలు అధికార పార్టీ కి అనుకూలురు కావడం వల్ల జరిగిన వ్యవహారంగా ప్రజలు భావిస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా.. ప్రతి కీలక పోస్టులోనూ ప్రత్యేకించి తమకు అత్యంత అనుకూలమైన అధికారులను మాత్రమే నియమించారు. ఎన్నికల వేళ వచ్చిన తర్వాత.. వైసీపీ నాయకులతో అంటకాగుతూ వచ్చిన చాలా మంది అధికారులే నియోజకవర్గాలకు ఆర్వోలుగా కూడా ఉంటున్నారు. కొందరు ఆర్వోలు నామినేషన్ల సమయంలో ఎంత బరితెగించి ప్రవర్తించారో కూడా వార్తలు వచ్చాయి. కొడాలి వెంకటేశ్వరరావు పేరుతో మరొక వికలాంగుడు నామినేషన్ వేయడానికి వస్తే.. ఆర్వో ఆయన పట్ల ఎంత దురుసుగా ప్రవర్తించారో అందరూ గమనించారు.
గ్లాసు గుర్తు అనేకమందికి దక్కడం ఆ మేరకు తెలుగుడేశం, బిజెపి ఓడిపోవడం కోసం ఆర్వోల సహకారం ఎంతో ఉన్నదని పలువురు అనుమానిస్తున్నారు. అయినా జనసేన ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించింది. బుధవారం నాడు ఈ విషయంపై కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లకు దక్కిన ‘గ్లాసు’ వారిచేతిలోనే ఉంటుందో.. చేజారుతుందో వేచిచూడాలి.
వైసీపీ నెత్తిన పాలు పోసిన ఆర్వోలు!
Wednesday, January 22, 2025