జగన్‌కు ముడుపులు ఇచ్చిన వాళ్లకు ఏడుపులే మిగిలాయి?

Wednesday, January 22, 2025

ఎవరైనా సరే తమకు అవసరమైన ఒక పనిని నెరవేర్చుకోవడానికి నాయకులకు పెద్దపెద్ద ముడుపులు సమర్పించుకుని మరీ అడ్డదారుల్లో టెండర్లు దక్కించుకుంటారంటే దాని అర్థం ఏమిటి? ఆ టెండరు ద్వారా అడ్డగోలుగా సంపాదించుకోవాలనేదే కదా?  కనీసం నాయకులకు ఏ స్థాయిలో ముడుపులు సమర్పించుకున్నారో ఆ మేరకు అయినా.. ఆ కాంట్రాక్టు ద్వారా.. వక్రమార్గంలో సంపాదించుకోవాలని వారు ఆశిస్తారు కదా? కానీ కనీసం ఆ మేరకు కూడా గిట్టుబాటు కాకముందే సదరు కాంట్రాక్టుల్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే వారి గతేమిటి? లంచం డబ్బులన్నీ ముందే ముట్టజెప్పేసి పనులు దక్కించుకున్న తరువాత.. అవి కాస్తా రద్దయిపోతే వారికి మిగిలేది ఏడుపే కదా? ఇప్పుడు ఏపీలో అదే ఏడుపులు సర్వత్రా వినిపిస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిదేళ్లు పదవీకాలంలో ఎక్కడికక్కడ అడ్డదారుల్లో దోచుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వంలోని పెద్దలకు లంచాలు ఇవ్వడం ద్వారా ప్రాజెక్టులు దక్కించుకోవడం, వారిని ప్రలోభపెట్టం లేదా వారికి వాటలు ఇవ్వడం ద్వారా పనులు చక్కబెట్టుకోవడం అనేది సర్వసాధారణంగా మారింది. అప్పట్లో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుని ఇంకా తమ తమ ప్రాజెక్టులను గ్రౌండ్ చేయని వివిధ సంస్థలతో ఒప్పందాలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. రద్దుచేసేశారు. ఇది సాధారణంగా జరిగేదే అదే సమయంలో.. ఇంకా అనేక వ్యవహారాలు ఈ తరహాలో అప్పట్లో లంచాలు ఇచ్చి పనులు చేసిన, కాంట్రాక్టులు పొందిన వారికరి డుపు తెప్పిస్తున్నాయి.
450 కోట్ల రూపాయల వ్యయంతో జగన్మోహన్ రెడ్డి విశాఖలోని రుషికొండకు బోడి కొట్టించి.. తన కుటుంబం కోసం అత్యంత విలాసవంతమైన మూడు భవంతులను కట్టించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం ఆ కాంట్రాక్టులోని లొసుగులను తోడుతోంది. ఏయే అక్రమాలు జరిగాయో గుర్తించి.. అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టరు ద్వారానే రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదొక్కటే కాదు. అనేక ప్రాజెక్టుల విషయంలో స్రభుత్వానికి వాటిల్లిన నష్టాన్ని అప్పుడు పనులు చేసిన కాంట్రాక్టర్ల ద్వారానే రికవరీ చేయాలని అనుకుంటుండడం వారందరికీ షాక్

108, 104 వాహనాల నిర్వహణ సేవలు అందించడానికి జగన్ హయాంలో అరబిందో సంస్థ ఏకంగా ఏడున్నర సంవత్సరాలకు టెండర్లు దక్కించుకుంది. ఆ మేరకు జగన్ సర్కారుకు భారీ ముడుపులు సమర్పించుకుని కాంట్రాక్టు దక్కించుకున్నారు. లంచాలన్నీ తమకు లాభాలుగా ప్రతిఫలించేలా.. అత్యంత ఘోరంగా ఆ సేవలు నిర్వహిస్తూ వచ్చారు.  వారి సేవాలోపాల గురించి ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ప్రశ్నించగానే.. ఇంకా కాంట్రాక్టు రెండున్నరేళ్లు ఉన్నప్పటికీ.. తాము తప్పుకుంటాం అని వారు నష్టానికి సిద్ధపడి పక్కకు వెళుతున్నారు.

అలాగే.. జగన్ దళాలకు భారీ ముడుపులు సమర్పించి.. వారిద్వారా ఒత్తిడి చేయించి కాకినాడ పోర్టులో అరబిందో సంస్థ 41 శాతం వాటాలు దక్కించుకున్నది అనేది ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారుతోందని పవన్ ఆరోపణల నేపథ్యంలో అరబిందో సంస్థ వాటాలు దక్కించుకున్న వైనం కూడా ప్రశ్నార్థకం అవుతోంది. ఆ డీల్ లు రద్దయినా ఆశ్చర్యం లేదని పలువురు భావిస్తున్నారు.

అదానీ సంస్థలు సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూాయల లంచం ఇచ్చి దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అమెరికాలోని ఎఫ్‌బిఐ తేల్చిన సంగతి ఇది. అయితే ఈ ఏడాది సెప్టెంబరు నుంచి చేయవలసిన సరఫరా ఇంకా మొదలు కాలేదు. ప్రజల నుంచి ఒత్తిడుల నేపథ్యంలో ప్రభుత్వం ఆ విద్యుత్తు ఒప్పందాలను రద్దుచేైసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. అదానీ సంస్థలు యిచ్చిన లంచాలు మొత్తం గోవిందార్పణం అయినట్టే.
ఇలా జగన్మోహన్ రెడ్డికి ముడుులు సమర్పించుకుని అడ్డదారుల్లో సంపాదించుకోడానికి వక్ర ఒప్పందాలు కుదుర్చుకున్న వారందరూ ఇప్పుడు వలవల ఏడుస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles