మహేష్‌ చేయబోతున్న రెండు పాత్రలు అవేనా!

Saturday, July 20, 2024

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న రాజమౌళి – మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఆ రోజున ఈ మూవీ కాన్సెప్ట్ వీడియోని విడుదల చేస్తారని సమాచారం. ఐతే, మహేష్ ఈ సినిమాలో ద్విపాత్ర అభినయం చేయబోతున్నాడని.. అందులో ఒక క్యారెక్టర్ నెగిటివ్ రోల్‌  లో ఉంటుందని సమాచారం. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ రెండో పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే, మరో క్యారెక్టర్ విషయానికి వస్తే.. మహేష్ వరల్డ్ ట్రావెలర్ గా కనిపించనున్నాడట.

ఇక తాను జులై లేక ఆగస్టులో మ్యూజిక్‌ వర్క్‌ మొదలు పెడతా అని ఎం.ఎం. కీరవాణి చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల ఎంపిక విషయంలో రాజమౌళి టెస్ట్‌ షూట్స్‌ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ లాక్‌ అయ్యింది. ప్రస్తుతం టీమ్ డైలాగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని టాక్‌.

ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుందట. కాగా తెలుగు నటీనటులనే కాకుండా, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు కూడా ఈ సినిమాలో యాక్ట్‌ చేయనున్నారట. అలాగే, ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనుందని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles