దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అవినీతి చేశారనే ఆరోపణల మీద ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న అధికారి శాంతి. ఆమె మీద ప్రస్తుతం దేవాదాయ శాఖ పరంగా విచారణ జరుగుతోంది. వైసీపీ నాయకులు, విజయసాయిరెడ్డితో లాలూచీ పడి.. అనేక భూఆక్రమణలకు ఆమె సహకరించారని, కోట్లాదిరూపాయలు సంపాదించుకున్నారనేది ఆమె మీద ఉన్న ప్రధాన ఆరోపణ. విశాఖలో దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావడంలో ఆమె పాత్ర ఉన్నదని అంటున్నారు. ఈ ఆరోపణలు విచారణలో నిగ్గు తేలుతాయి.
అయితే మరో వివాదం సంచలనంగా మారి ఆమెను ఇబ్బంది పెడుతోంది. తాను ఆల్రెడీ విడాకులు తీసుకున్నట్టుగా ఆమె క్లెయిం చేస్తున్న భర్త మదన్ మోహన్ ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు. తాను అమెరికాలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డితో కలిసి ఆమె కొడుకును కన్నదని చెబుతున్నారు. ఈ రాద్ధాంతం గురించి రాష్ట్రమంతా తెలుసు. విజయసాయిరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ కావడంతో.. అందరికీ విషయం తెలిసింది. ఈ సంచలనాంశాల పర్యవసానాలలో అధికారి శాంతి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుందేమో అని ప్రజలు అనుమానిస్తున్నారు.
వైసీపీలో కీలక నాయకుడు, గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి మీద ఆరోపణలు చేసినందుకు తనకు ప్రాణహాని ఉన్నదని, శాంతి భర్త మదన్ మోహన్ హోంమంత్రికి విన్నవించుకున్నారు. ఆయన ఇప్పటికీ కూడా.. శాంతి తన ప్రస్తుత భర్తగా చెప్పుకుంటున్న హైకోర్టు న్యాయవాది సుభాష్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఇద్దరికీ డిఎన్ఏ పరీక్షలు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతటి రాజకీయప్రముఖుల మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రాణహాని గురించి భయపడడం సహజం. అయితే.. మదన్ మోహన్ కంటె శాంతి ప్రాణాలకే హాని ఉండచ్చునని పలువురు అంటున్నారు.
శాంతిని అంతమొందించి ఆత్మహత్యగా చిత్రీకరిస్తే గనుక.. ఈ ప్రచారం చుట్టూ తెలుగుదేశం ఉన్నదని, వారే బలి తీసుకున్నారని డైవర్ట్ చేయడం సులువు అవుతుంది. అందరి పాపాలు మరుగున పడిపోతాయని అనుకుంటున్నారు. గతంలో జగన్ పథకాల గురించి ఓ మహిళ వీడియో చేస్తే, ఆమెను ట్రోల్ చేశారు. తర్వాత ఆమె రైలు కింద పడి మరణించింది. తెలుగుదేశం వారి ట్రోలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నదని ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఆమెను ఎవరో రైలు కింద తోస్తేనే పడిపోయిందని, వైసీపీ వారే ఆమెను తోసేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించి.. ఇలాంటి నిందలు వేశారని అప్పట్లో ఒక వాదన వినిపించింది.
అదే తరహా డ్రామా ఇప్పుడు శాంతి విషయంలో జరిగినా ఆశ్చర్యం లేదని పలువురు భయాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ముందుజాగ్రత్త వహించి శాంతికి కూడా భద్రత కల్పించడం మేలని అంటున్నారు.
శాంతి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయా?
Wednesday, November 13, 2024