ఎస్సీ, బీసీ సెల్ సమావేశాలు జగన్ స్థాయికి తగవా?

Friday, December 5, 2025

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడూ పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ ఈ పార్టీకి తానే అధినేతననే సంకేతాలను అందరికీ పంపడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే తాను తలచినప్పుడు ఓ మీటింగుకు రావడమే తప్ప.. రాష్ట్రస్థాయి పార్టీ ప్రతినిధులతో జరిగే అనేక కీలక సమావేశాలకు కూడా ఆయన హాజరు కారు. ఆయన పరోక్షంలో సజ్జల రామకృష్ణారెడ్డి సారధ్యంలోనే పలు సమావేశాలు జరుగుతుంటాయి. రాష్ట్రస్థాయిలో ఏ విభాగానికి చెందిన నాయకులైనా సరే ఒక సమావేశానికి కూర్చున్నప్పుడు వారిని ఉద్దేశించి మాట్లాడే తీరిక లేకుండా ఈ మాజీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది.

అలాంటి అనేక సమావేశాలు తాడేపల్లిలో జరిగే సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి మాత్రం తన బెంగళూరు ఎలహంక ప్యాలెస్ లో సేద తీరుతూ విలాసంగా గడుపుతూ ఉంటారు. ఇంకా లోతుగా పరిశీలించినప్పుడు బీసీ, ఎస్సీ సెల్ రాష్ట్రస్థాయి పార్టీ సమావేశాలు జరిగితే అవి తన స్థాయి సమావేశాలు కాదు అన్నట్లుగా ఆయన బిహేవ్ చేస్తుంటారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ లోని ఎస్సీ నాయకులు, ప్రతినిధులు అందరికీ ఇలాంటి అవమానమే ఎదురైంది.

తాడేపల్లి లో ఎస్సీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, ఇంకా కొమ్మూరి కనకారావు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు తదితర నాయకులు అనేకమంది హాజరయ్యారు. వీరందరూ ఏదో రీతిగా జగన్ భజన చేశారు. ఈ సమావేశానికి నాయకత్వం సారధ్యం వహించిన సజ్జన రామకృష్ణారెడ్డి.. జగన్ ఎలాంటి పడికట్టు మాటల స్క్రిప్ట్ తో సమావేశాలలో మాట్లాడుతూ ఉంటారో అదే స్క్రిప్టును తాను కూడా వల్లించారు.

‘మనం ఇవాళైనా ప్రజల వద్దకు తలెత్తుకొని వెళ్లగలం.. కూటమి నాయకులు ప్రజల వద్దకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు.. హామీలు నిలబెట్టుకోలేదు’ ఇలాంటి రొటీన్ పాచిపోయిన విమర్శలు ఆయన మాటల్లో ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే కీలకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి కి సోమవారమే చేరుకున్నారు. తాడేపల్లి వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికిన ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించారు. జగన్ అనుకూల నినాదాలు చేశారు. ఆయన చిరునవ్వుతో అందరికీ అభివాదం చేస్తూ నమస్కారాలను స్వీకరించారు. అంతే తప్ప ఎస్సీ సెల్ సమావేశంలో తాను స్వయంగా పాల్గొని పార్టీ నాయకత్వానికి దిశా నిర్దేశం చేయడం గురించి జగన్ ఆలోచించలేదు.

ఇది మొదటిసారి కాదు నాలుగు రోజుల కిందట బీసీ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగినప్పుడు, దానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి సారథ్యం వహించారు. జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. ఆయన బెంగుళూరు ఎలహంక ప్యాలెస్ లోనే ఉన్నారు. బీసీ ఎస్సీ కార్యవర్గాలు, పార్టీ విభాగాలు అంటే జగన్మోహన్ రెడ్డికి అంత చులకన గా ఉందా? రాష్ట్రస్థాయి నాయకులంతా వచ్చినప్పుడు తాను హాజరుకాకుండా బెంగళూరులో అంతగా ఆయన ఏం చేస్తున్నారు.. అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

ఎస్సీ కార్యవర్గం, నాయకులు తనకు జేజేలు కొట్టి ర్యాలీతీయడం, తన భజన చేయడం వంటివి జగన్ కోరుకుంటారు గానీ.. వారితో సమావేశానికి టైం లేకుండాపోయిందా.. ఎటూ బెంగుళూరు నుంచి వచ్చిన ఆయన కొన్ని గంటలు ముందుగా వచ్చి సమావేశంలో పాల్గొని ఉంటే ఎంతో పరువుగా ఉండేది కదా.. అని ఎస్సీ నాయకులు వాపోతున్నారు.  జగన్ 2.0 సర్కారు ఎప్పటికి వస్తుందో ఏమో తెలియదు గానీ.. ఇలాంటి పరిణామాలు చూసినప్పుడు జగన్ అహంకారం 2.0 స్థాయికి వెళ్లినట్టు అనిపిస్తోందని ప్రజల వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles