ప్రచారకూలీలకు నకిలీనోట్లు.. ఓట్లకు మంచివి ఇస్తారా?

Sunday, December 22, 2024

రాజకీయాల్లో ప్రధానంగా ఎన్నికల పర్వంలో ‘నమ్మకం’ ముఖ్యం. ఈ నమ్మకం అటు నాయకులకు, ఇటు ప్రజలకు ఉండాల్సిన అవసరం తక్కువ. ఓట్లను కొనుగోలు చేసే నాయకులకు ఆ నమ్మకం చాలా చాలా ఉండాలి. తాము ఒక్కో ఓటుకు వేలకు వేలు డబ్బు ఇచ్చేస్తారు.. తీసుకున్న ఓటరు తమ గుర్తుకే గుద్దుతాడనే నమ్మకం వారికి ఉండాలి. ప్రజలు డబ్బుపుచ్చుకునే వైపు మాత్రమే ఉంటారు గనుక.. వారి నమ్మకానికి విలువ తక్కువ. కానీ.. ఇప్పుడు వైసీపీ నాయకుల పుణ్యమాని పరిస్థితి ఎలా అవుతున్నదంటే.. ప్రజలు కూడా నాయకులు ఇచ్చే డబ్బును అనుమానించాల్సి వస్తోంది. అవి అసలు నోట్లో నకిలీ నోట్లో తెలియక తికమక పడుతున్నారు. ఎన్నికల ప్రచారానికి కూలీగా వెళ్లినందుకు వైసీపీ నేతలు ఇచ్చిన నోట్లు నకిలీవి అని తేలిన తర్వాత.. కనీసం ఓట్లకైనా మంచినోట్లు ఇస్తారా.. లేదా ఇలాగే మోసం చేస్తారా? అనే  భయాలు కూడా వారిని వెన్నాడుతున్నాయి.

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు 200 కూలి ఇస్తామని పిలిచేసరికి కొన్ని గంటల ప్రచారానికి వెళ్లామని, వారు ఇచ్చిన వంద నోట్లను ఇంటికొచ్చిన తర్వాత చూసుకుంటే అవి నకిలీనోట్లు అని తెలిసిందని పాపం పేద ప్రజలు గొల్లుమంటున్నారు. ప్రచారానికి కూలీలుగా వచ్చిన వారికి.. ఫ్యాన్సీగా ముద్రించే నకిలీనోట్లను పార్టీ వారు అంటగట్టారు. అవి అచ్చం వంద రూపాయల నోటు మాదిరిగానే ఉంటాయి. కానీ దొంగనోట్లు కాదు. వాటిమీద రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఉండదు. పిల్లలు ఆడుకోవడానికి ముద్రించే నోట్లు అన్నమాట. నందికొట్కూరులో ఇచ్చిన నోట్ల మీద మనోరంజన్ బ్యాంక్ ఆఫ్ఇండియా, 100 ఫుల్ ఆఫ్ ఫన్’ అంటూ రాసి ఉండడం గమనార్హం. ‘రుపీస్’ అనే మాట కూడా లేదు.

ఈ నోట్లు చూసి మోసపోయాం అని గ్రహించిన పేదలు.. తమకు డబ్బులిచ్చిన నాయకుడి వద్దకు వెళ్లి అడిగితే.. మేం మంచి నోట్లే ఇచ్చాం అంటూ గద్దించి పంపేశారని వాళ్లు అంటున్నారు.

ఇదొక ఎత్తు అయితే.. ప్రచారం కూలీలుగా దొంగనోట్లు ఇచ్చిన వారు కనీసం ఓట్లు కొనుగోలు చేయడానికైనా సరైన నోట్లు ఇస్తారా అనే భయం ప్రజలను వెన్నాడుతోంది. ఈసారి ఓటుకు రెండు వేల నుంచి మూడువేల రూపాయల వరకు ధర పలుకుతుందని పేదలు ఆశిస్తున్నారు. ఇప్పుడు కామెడీ నోట్లు పంచిన వారు.. రేపు ఓట్లకు కొంపదీసి ఫేక్ కరెన్సీ ఇస్తారేమోనని, ఆ నకిలీనోట్లను తీసుకువెళితే మళ్లీ తాము కొత్త కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఈ వైసీపీ నాయకులనుంచి ఓటుకు నోట్లు ఆశిస్తే.. తమను దొంగనోట్ల కేసుల్లో ఇరికిస్తారేమోనని చర్చించుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles