అనిత మాటలు జగన్ కు ప్రమాదఘంటికలేనా?

Sunday, November 24, 2024

జగన్మోహన్ రెడ్డి హయాంలో చీటికిమాటికి ఒక మాట వినిపిస్తూ ఉండేది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు ఏ విమర్శలు చేసినా సరే వాళ్ళు సహించే వారు కాదు. నిజానికి వైసీపీ నాయకులు కూడా చంద్రబాబు వ్యాఖ్యలను పెద్దగా ఖండించేవారు కాదు. వారి తరఫున జగన్ భక్త పోలీస్ అధికారులే మీడియా ముందుకు వచ్చేవారు. చంద్రబాబు నాయుడు అలా విమర్శలు చేసినందుకు ఆయన మీద కేసులు పెడతాం. ఐనా మీ ఇష్టప్రకారం వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు. ఆయన వద్ద ఆధారాలు ఉంటే అవి మాకు ఇవ్వాలే తప్ప అలా రోడ్డున పడి మాట్లాడడానికి వీల్లేదు అనే రకరకాల కథలు చెప్పే వాళ్ళు! ఇప్పుడేమో ఓడలు బండ్లు అయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష స్థాయి కూడా లేని ఎమ్మెల్యేగా మిగిలారు. ఇదే డైలాగులను ఆయన ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. అసలు వినుకొండలో ఒక్క హత్య జరిగితే అది కూడా ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య వ్యక్తిగత కారణాల వల్ల హత్య జరిగితే దానిని చంద్రబాబు నాయుడుకి ముడిపెట్టడానికి జగన్ పడుతున్న తాపత్రయం అలవికానిది!

తలా తోకా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ 40 రోజుల పాలనలో రాష్ట్రంలో ఏకంగా 36 రాజకీయ హత్యలు జరిగాయని తీర్మానించడం- ప్రజలకు చాలా ఆగ్రహం తెప్పిస్తోంది. జగన్ చెబుతున్నట్లుగా 36 హత్యలు జరిగినది నిజమే అయితే కనుక మిగిలిన 35 మందిని పరామర్శించకుండా జగన్ ఏం చేస్తున్నారు? ఎటూ ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితమై ఖాళీగా కూర్చునే ఉన్నారు కదా అని జగన్ ను ప్రశ్నిస్తున్నారు.
హోం మంత్రి అనిత విమర్శలు పరిగణించదగినవి. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటిదాకా కొత్త ప్రభుత్వం వచ్చాక జరిగినది నాలుగు రాజకీయ హత్యలు మాత్రమే వీటిలో ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు అని వివరించారు. కాగా 36 రాజకీయ హత్యలు జరిగాయిని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి తన వద్ద వివరాలు ఉంటే నాకు సమాచారం ఇవ్వాలంటూ హోంమంత్రి డిమాండ్ చేశారు. అలా జగన్మోహన్ రెడ్డి వద్ద సరైన సమాచారం లేకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అంటూ అనిత ప్రశ్నించడం సంచలనాంశంగా మారుతోంది. సాక్షాత్తు హోంమంత్రి మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని అంటున్నారంటే ఈసరికే పోలీసులు జగన్ మీద కేసులు పెట్టడానికి రంగం సిద్ధం చేసి ఉంటారని అభిప్రాయం పలువులలో వ్యక్తం అవుతుంది.

గత ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సామాన్యులను కూడా తీవ్రంగా వేధించిందంటూ అనిత విమర్శించారు. వాళ్ళందరూ ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆరోపించారు తన పట్ల విమర్శలను అంత ఘోరంగా సహించే అలవాటు కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పడం కామెడీగా ఉందని అని అంటున్నారు. అధికారం కోల్పోయిన 40 రోజుల్లోనే ఆయనకు మైండ్ పనిచేయడం మానేసింది అని ఆమె సెటైర్లు వేయడం విశేషం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles