మళ్లీ కలుస్తారా!

Wednesday, March 26, 2025

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. తన సతీమణి సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే వారు ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం జరిగింది. పైగా ఆ తర్వాత విడాకులపై సైరా భాను మాట్లాడుతూ.. ‘తమ మధ్య అంతులేని దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాన’ అని సైరా భాను చెప్పుకొచ్చింది.

అయితే, లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ జంట తిరిగి కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇటీవల సైరా భాను అనారోగ్యంతో బాధపడితే ఏఆర్ రెహమాన్ అండగా నిలిచాడట. ఈ విషయాన్ని సైరా భాను తరుపు లాయర్ బయటపెట్టింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఏఆర్ రెహమాన్ తనకు అండగా నిలిచాడు అంటూ సైరా భాను కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. 1995లో సైరా భానుని పెళ్లాడిన ఏఆర్ రెహమాన్‌కి ముగ్గురు పిల్లలు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles