ఆ నిర్మాతతో అనుష్క పెళ్లి?

Wednesday, December 18, 2024

తెలుగు చిత్ర సీమకు అనుష్క శెట్టి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నాగార్జున హీరోగా నటించిన సూపర్‌ సినిమాతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ మారిపోయింది. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అరుంధతి భారీ విజయాన్ని సాధించడంతో అనుష్కకు వరుస అవకాశాలు వచ్చాయి.

మహేష్ , ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో జతకట్టింది. ఆ తరువాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను పలకరించడమే గగనం అయింది.ఈ భామ నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమాలు అంతగా రాణించలేదు. ఇక ఆమె పెళ్లి గురించిన చర్చ ఎప్పటికప్పుడు తెరమీదకు వస్తూనే ఉంది.

ఇక ఇప్పుడు అనుష్కపై ఓ రూమర్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేమంటే ఇప్పుడు 42 ఏళ్ల అనుష్క కన్నడ సినీ నిర్మాతను వివాహం చేసుకోనుందని సమాచారం.  సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ సమాచారంలో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ నిజానికి కొన్నాళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ భామ.. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మరీప్పుడు అనుష్క పెళ్లి జరుగుతుందా? లేక ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles