ఆంధ్రకి మరో స్ట్రిక్ట్‌ ఆఫీసర్‌..ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గా అనురాధ!

Wednesday, January 22, 2025

చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రంగాలను ప్రక్షాళన చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే వారి దృష్టి ఆంధ్రపద్రేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పై పూర్తిగా దృష్టి సారించింది. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ బాధ్యతల్ని రిటైర్డ్‌ పోలీస్ అధికారిణి ఏఆర్‌.అనురాధ చేతిలో పెట్టింది. ఈ విశ్రాంత ఐపీఎస్ ఆఫీసర్‌ ఏఆర్ అనురాధను చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించారు. మరోవైపు మరికొంత మంది అధికారుల పేర్లు కూడా ఈ పోస్టు కోసం బలంగా వినిపించాయి. అయితే.. చివరికి ప్రభుత్వం ఏఆర్‌ అనురాధ వైపు మొగ్గుచూపింది. తాజాగా అధికారిక ఉత్తర్వులు కూడా వచ్చాయి.

ఏఆర్ అనురాధ ఏపీ ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్‌ అధికారిణి. డీజీ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో కూడా చేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఆమె భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారే. ఆమె నియామాకానికి సంబంధించిన  ఫైలును సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు సమాచారం. ఏఆర్‌.అనురాధ నియామకానికి ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా సుముఖత తెలపడంతో ఆమె నియామకం లాంఛనమైంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు దాటినా ఏపీపీఎస్సీకి చైర్మన్ నియామకం జరగలేదు. దీంతో ఉద్యోగ నియామకాలు, కొత్త నోటిఫికేషన్లు ముందుకు కదలలేదు. ఇప్పటికే ప్రకటించిన పలు నోటిఫికేషన్లకు సంబంధించిన పలు పరీక్షలు నిలిచిపోయాయి. మరి కొన్ని పరీక్షల తేదీలు ఇంకా ప్రకటించలేదు. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనని ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పలు పేర్లు పరిశీలించిన అనంతరం ఏఆర్‌.అనురాధ ఏపీపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌ అని తెలిపోయింది.

ఏపీపీఎస్సీ ప్రక్షాళన తర్వాత ఉద్యోగ నియమాకాల ప్రక్రియ కూడా వేగవంతమయ్యేలా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఏపీ టెట్‌ పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ నిమగ్నమైంది. అక్టోబర్‌ 3 నుంచి ఏపీలో టెట్‌ పరీక్షలు ప్రారంభమై.. 21వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. త్వరలో ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles