రామాయణంలో మరో స్టార్ నటుడు!

Sunday, December 22, 2024

బాలీవుడ్‌ లో రామాయాణాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ  సినిమాలన్ని కూడా  వివిధ కాలాల్లో, వివిధ దర్శక నిర్మాతలతో రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బాలీవుడ్ అగ్ర దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ’ మూవీని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌,సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నట్లు చిత్ర బృందం తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రంలో మరో బాలీవుడ్ యాక్టర్ కూడా భాగం కాబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ నటుడు కునాల్‌ కపూర్‌ ఈ సినిమాలో ఓ  కీలకపాత్ర పోషిస్తున్నారని టాక్‌. దీనికోసం ఇప్పటికే ఆయనకు స్క్రీన్‌ టెస్ట్‌ కూడా నిర్వహించినట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

కునాల్ సైతం తన పాత్ర కోసం రిహార్సిల్స్‌ మొదలు పెట్టినట్లు టాక్‌. అయితే, ఈ పాత్రకు సంబంధించిన వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచాలని అనుకుంటుందట. త్వరలోనే కునాల్ షూటింగ్ లో సైతం జాయిన్ అవుతారని టాక్‌. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ లో కునాల్ కపూర్ విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles