టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబోలో రూపుదిద్దుకున్న భారీ పాన్ ఇండియా సినిమా “దేవర”. మరి ఈ సినిమా గురించి అభిమానులు ఎన్నో నెలల తరబడి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఫైనల్ గా ఆ సమయం మరో మూడు రోజుల వ్యవధిలోకి వచ్చేసింది.
అయితే ఎన్టీఆర్ కి మాస్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా భారీ లెవెల్లో ఉంది. అయితే ఈ సినిమాతో ఇప్పటికే ఎన్టీఆర్ బిగ్గెస్ట్ రికార్డ్స్ బుకింగ్స్, బెనిఫిట్ షోస్ ఫుల్స్ తోనే చూపిస్తుండగా లేటెస్ట్ గా మరో సెన్సేషనల్ రికార్డుని మ్యాన్ ఆఫ్ మాసెస్ తన ఖాతాలో వేసుకున్నట్టుగా సమాచారం.
అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలుగా 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని నార్త్ అమెరికా మార్కెట్ లో కొట్టిన రెండో హీరోగా తారక్ తన సినిమాలైన RRR, దేవర లతో నిలిచాడు. దీనికి ముందు ప్రభాస్ నటించిన భారీ సినిమాలు “సలార్” అలాగే “కల్కి 2898 ఎడి” సినిమాలు నిలిచాయి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.