శ్రీ విష్ణు మార్క్‌తో మరో ఎంటర్‌టైనర్! టాలీవుడ్‌లో కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే బిరుదు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు పలు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన నటించే సినిమాలు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా సినిమా ‘సింగిల్’. కార్తిక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ తాజాగా టైటిల్ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. లవ్ అంటే ఏమాత్రం ఇష్టం లేని పాత్రలో శ్రీవిష్ణు మరోసారి సాలిడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సింగిల్‌గా ఉన్నాడంటూ అతని పాత్రను ఇంట్రడ్యూస్ చేశాడు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్. అయితే, అతడిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారని ఈ సినిమా కథలోని నేపథ్యాన్ని చెప్పుకొచ్చాడు. ఇక మిగతా విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని ఆయన తెలిపినట్లు ఈ వీడియో గ్లింప్స్ ముగించారు.మొత్తానికి శ్రీవిష్ణు ఈ సారి ట్రై యాంగిల్ లవ్ స్టోరీ తో పాటు బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా పట్టుకొస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.