టాలీవుడ్ ఎంట్రీకి మరో బాలీవుడ్ బ్యూటీ..?

Friday, December 5, 2025

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జఠాధర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

ఈ సినిమాలో నమత్రా శిరోధ్కర్ సోదరి శిల్పా శిరోధ్కర్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోనాక్షి సిన్హా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తమిళ్‌లో రజినీకాంత్ సరసన ‘లింగ’ చిత్రంలో నటించింది. కానీ, ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆమెకు గుర్తింపు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో నటించి, తెలుగులో సాలిడ్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా మంచి విజయాన్ని అందుకోవాలని ఆమె చూస్తుందట. మరి నిజంగానే ఈ సినిమాలో సోనాక్షి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా అనేది చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles