కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున తలపడుతూ, ఏమాత్రం సంకోచం లేకుండా తనను హంతకుడని ప్రతి ప్రసంగంలోనూ పేర్కొంటూ విమర్శలతో హోరెత్తిస్తున్న వైఎస్ షర్మిల ధాటిని, ప్రస్తుత ఎంపీ, వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి తాళలేకపోతున్నారు. షర్మిల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం వారికి చేతకావడం లేదు. ఏం చెప్పాలో అర్థం కానట్టుగా.. ‘మా కుటుంబంలో కూడా చీలిక తెచ్చారు. మాపై ఎంత ద్వేషంతో మాట్లాడుతున్నారో చూడండి’ అని అవినాష్ రెడ్డి చిలకపలుకులు పలుకుతున్నారు. తమ కుటుంబంలో ఎవ్వరో చీలిక తెచ్చినట్టుగా అవినాష్ రెడ్డి మాట్లాడడం చూసి కడప జిల్లా ప్రజలు మాత్రం నవ్వుకుంటున్నారు.
నిజానికి వైఎస్ రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి లది ఒక కుటుంబం. అవినాష్ రెడ్డిది ఇంకో కుటుంబం కిందికి వస్తుంది. ఈ కుటుంబ వ్యవహారాలు కడప జిల్లా ప్రజలకు చాలా బాగా తెలుసు. అలాంటి నేపథ్యంలో ‘మా కుటుంబంలో చీలిక తెచ్చారు’ అని అనడం ద్వారా అవినాష్ రెడ్డి.. ఎవరి కుటుంబం గురించి మాట్లాడుతున్నారు.. ఆ చీలికను ఎవరు తెచ్చారని మాట్లాడుతున్నారు? అనేది కడప జిల్లా ప్రజలకు పెద్ద సందేహంగా ఉంది. రాజకీయంగా అవినాష్ రెడ్డి , జగన్మోహన్ రెడ్డి కి ఎంతగా ఉపయోగపడ్డారనేది ప్రజలకు తెలియదు. కానీ 2019 ఎన్నికల సమయంలో కడప ఎంపీ టికెట్ ను తన చెల్లెలు షర్మిలకు కాకుండా, అవినాష్ రెడ్డికి కేటాయించడం వెనుక ఎలాంటి వ్యూహాలు, మంత్రాంగం నడిచిందో మాత్రం స్థానికులకు ఒక అవగాహన ఉంది. ‘మా కుటుంబంలో’ అని అవినాష్ అంటున్నారు గానీ.. నిజానికి ‘వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టింది, చీలిక తెచ్చింది అవినాష్ రెడ్డే కదా’ అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
కడప ఎంపీ సీటుకోసం అవినాష్ పట్టుపట్టకుండా ఉంటే, ఆ సీటును అప్పట్లో షర్మిలకు జగన్ కేటాయించి ఉంటే గనుక.. అసలు రాజశేఖర రెడ్డి కుటుంబంలో చిచ్చు పుట్టేదే కాదు కదా.. అనేది ప్రజల మాట. ఎంపీ సీటుకోసం ఆశపడి అన్నా చెల్లెళ్ల మధ్య చీలిక తెచ్చిన అసలు దోషి అవినాష్ కదా అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. షర్మిలకు కడప ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుపట్టినందుకే కదా..
వివేకానందరెడ్డిని హత్య చేశారు అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారి కుటుంబంలో బయటివారు ఎవ్వరూ చీలికలు తేలేదని.. చీలికలకు అసలు మూలకారకుడు అవినాషే అని విమర్శలు వస్తున్నాయి.
‘మా కుటుంబంలో చీలికలు తెచ్చారు’ అని ఏదో స్వీపింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా.. చంద్రబాబును దోషిని చేయాలని అవినాష్ అనుకోవచ్చు గానీ.. ఆయన మాటలు బూమరాంగ్ అవుతున్నాయని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
అన్నా చెల్లెళ్ల మద్య చిచ్చు.. నీపుణ్యం కదా అవినాష్!
Sunday, December 22, 2024